Begin typing your search above and press return to search.

చాలా కాలానికి క‌న్న‌డ బ్యూటీ కంబ్యాక్

ముఖ్యంగా నిఖిల్ సిద్ధార్థ్ స‌ర‌స‌న 'స్వ‌యంభు'లో ఈ బ్యూటీ ఒక క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

By:  Tupaki Desk   |   14 April 2024 6:55 AM GMT
చాలా కాలానికి క‌న్న‌డ బ్యూటీ కంబ్యాక్
X

త‌న‌దైన అందం, న‌ట‌ప్ర‌తిభ‌, డ్యాన్సుల‌తో తెర‌పైకి దూసుకొచ్చిన క‌న్న‌డ న‌టి న‌భా న‌టేష్ ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌బ‌డిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ఓ యాక్సిడెంట్ కార‌ణంగా కొంత విరామం తీసుకోవాల్సి వ‌చ్చినా ఎట్ట‌కేల‌కు తిరిగి కోలుకుని వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేస్తోంది. నితిన్ తో 'మ్యాస్ట్రో' త‌ర్వాత చాలా గ్యాప్ లో ఇప్ప‌టికి న‌భా పేరు మ‌ళ్లీ వినిపిస్తోంది.

ముఖ్యంగా నిఖిల్ సిద్ధార్థ్ స‌ర‌స‌న 'స్వ‌యంభు'లో ఈ బ్యూటీ ఒక క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. లైవ్ వైర్ త‌ర‌హాలో నిరంత‌రం ఎన‌ర్జీతో ఆక‌ట్టుకునే న‌భా చేరిక స్వ‌యంభుకి ప్ల‌స్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ ఫిల్మ్ స్వయంభు షూటింగ్‌లో చిత్ర క‌థానాయ‌కుడు నిఖిల్ బిజీగా ఉండ‌గా ఇందులో సంయుక్త ఒక‌ కథానాయికగా న‌టిస్తోంది. త‌న‌తో పాటే మ‌రో కీల‌క పాత్ర కోసం న‌భాను ఖాయం చేసిన‌ట్టు ఇదివ‌ర‌కూ టీమ్ ప్ర‌కటించింది.

చారిత్రక నేపథ్యం ఉన్న క‌థ‌లో నాటి కాలానికి త‌గ్గ‌ట్టే న‌భా న‌టేష్ రూపానికి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేయ‌గా దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇక త‌న గ్రేట్ కంబ్యాక్ కోసం న‌భా న‌టేష్ ఆఫ్ ద స్క్రీన్ కూడా చాలా శ్ర‌మిస్తోంది. జిమ్ లో నిరంత‌రం క‌స‌ర‌త్తులు చేస్తూ షేప‌వుట్ కాని రూపంతో ఆక‌ర్షిస్తోంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన త‌న కొత్త ఫోటోలు వైర‌ల్ గా మారుతున్నాయి. న‌భా ఫిట్ లక్ కి యూత్ ఫిదా అయిపోతోంది.

స్వ‌యంభు చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా, సంగీతం రవి బస్రూర్, సెట్ డిజైన్‌ని ఎం ప్రభాకరన్, డైలాగ్స్‌ని వాసుదేవ్ మునెప్ప‌ క్రాఫ్ట్ చేస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో, పిక్సెల్ స్టూడియోస్ ప‌తాకంపై భువన్ -శ్రీకర్ నేతృత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అన్ని ప్రధాన భారతీయ భాషలలో విడుదల కానుంది.