స్వయంభూ రియల్ స్టోరీ.. అసలు గుట్టు విప్పిన నిఖిల్
ఈ సినిమా ఒక ఫిక్షనల్ స్టోరీ కాదు, సుమారు వేల ఏళ్ల క్రితం మన దేశంలో నిజంగా జరిగిన కథ ఆధారంగా దీన్ని రూపొందించారు అన్నారు.
By: M Prashanth | 11 Feb 2026 3:00 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రతీ సినిమాతో కూడా తన స్థాయిని పెంచుకుంటూ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి సినిమా వెనుక ఏదో ఒక స్ట్రాంగ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది అనేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ‘స్వయంభూ’ అనే పీరియడ్ డ్రామాతో మన ముందుకు వస్తున్న నిఖిల్, ఈ ప్రాజెక్ట్ గురించి చెబుతున్న విషయాలు ఫ్యాన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉంది.
నిజానికి హిస్టరీ అనగానే కేవలం గెలిచిన రాజుల గురించే అనుకుంటారు. కానీ ఆ విజయాల వెనుక ఉన్న సామాన్య సైనికుల గురించి ఎప్పుడూ పెద్దగా చర్చ జరగదు. నిఖిల్ ‘స్వయంభూ’ ద్వారా సరిగ్గా ఆ పాయింట్‌నే హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో నిఖిల్ ఈ సినిమా నేపథ్యం గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు.
ఈ సినిమా ఒక ఫిక్షనల్ స్టోరీ కాదు, సుమారు వేల ఏళ్ల క్రితం మన దేశంలో నిజంగా జరిగిన కథ ఆధారంగా దీన్ని రూపొందించారు అన్నారు. "యుద్ధాలు అంటే మనం ఎప్పుడూ పెద్ద పెద్ద రాజుల గురించి మాట్లాడుకుంటాం, కానీ హిస్టరీ బుక్స్ లో లేని చిన్న చిన్న సైనికుల పోరాటం మా ఈ సినిమా" అని నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. 985 AD కాలంలో ఒక సామాన్య సైనికుడు రాజదండం స్వాధీనం కోసం చేసిన యుద్ధమే ఈ కథాంశం అని క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమాలో హీరో ఒక పవర్ ఫుల్ రాజులా కాకుండా ఒక 'అండర్ డాగ్' లా కనిపిస్తారట. ఒక చిన్న సైనికుడు తన కలను నెరవేర్చుకోవడానికి ఎంత దూరం వెళ్ళాడు, ఎలా రాజ్యాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు అనేది చాలా ఎమోషనల్ గా చూపిస్తున్నట్లు తెలిపారు. నిఖిల్ ఈ క్యారెక్టర్ కోసం తీసుకున్న రిస్క్, చూపించిన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రవి బస్రూర్ సంగీతం ఈ విజువల్స్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని చిత్తూరు, తంజావూరు ప్రాంతాల మధ్య ఈ కథాంశం సాగుతుందని నిఖిల్ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా ఉండబోతుందనే లీక్ కూడా ఇచ్చారు. ఒకే సినిమాలో ఇంత పెద్ద హిస్టరీని కవర్ చేయడం కష్టం కాబట్టి, మేకర్స్ దీన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది. పది భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇక రిలీజైన టీజర్ చూశాక, నిఖిల్ కెరీర్ లో ఇది మరో బిగ్గెస్ట్ మూవీగా నిలవబోతుందని అర్ధమవుతుంది. మరి ఈ సామాన్య సైనికుడి గెలుపు ప్రయాణం థియేటర్లలో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే.
