Begin typing your search above and press return to search.

అంతందంగా ఏ దేవుణ్ణి మోక్కేస్తున్నావ్ అమ్మ‌డు?

ఓ పాట‌కు డాన్సు చేస్తూ మ‌న‌సులో దేవుణ్ని త‌లుచుకుంటూ రెండు చేతులు జోడించి బెడ్ రూమ్ లో డాన్స్ చేస్తుంది. అందులో అమ్మ‌డు తొడ పిక్క‌ల వ‌ర‌కూ ఓ గౌను ధ‌రించింది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:05 PM GMT
అంతందంగా ఏ దేవుణ్ణి మోక్కేస్తున్నావ్ అమ్మ‌డు?
X

స్వాతి అలియాస్ క‌ల‌ర్స్ స్వాతి సినిమాల‌తో మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వివాహం త‌ర్వాత అమ్మ‌డు కొన్నాళ్ల పాటు బ్రేక్ ఇచ్చింది. ఒక‌టి రెండు సినిమాలు చేసినా అవి పెద్ద‌గా గుర్తింపు తీసుకురా లేదు. ఈ క్ర‌మంలో జ‌ర్నీలో కొత్త ట‌ర్నింగ్ తీసుకుంది. అవ‌కాశాల కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇటీవ‌లే 'మంత్ ఆఫ్ మ‌ధు' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఏడాది త‌ర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. కానీ ఫ‌లితం నిరాశ ప‌రించింది.

జ‌ర్నీలో ఇవ‌న్నీ స‌హ‌జ‌మ‌ని భావించిన అమ్మ‌డు ముందుకు సాగుతుంది. ఇక బ్యూటీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండ‌టం చాలా రేర్. గ్లామ‌ర్ షో విష‌యంలో ఆచితూచి ఉంటుంది. అవ‌కాశాలు అందాలతోనే సాధ్య‌మా? ప్ర‌తిభ సాధ్యం కావా? అని బ‌లంగా న‌మ్మే న‌టి. అందుకే గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటుంది. రేర్ గా ఇన్ స్టాలో చిట్టి..పొట్టి దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిస్తుంది. తాజాగా బ్యూటీ ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఓ పాట‌కు డాన్సు చేస్తూ మ‌న‌సులో దేవుణ్ని త‌లుచుకుంటూ రెండు చేతులు జోడించి బెడ్ రూమ్ లో డాన్స్ చేస్తుంది. సొగ‌స‌రి రూప లావ‌ణ్యంలో పెద్ద‌గా మార్పులు రాలేదు. ఇప్ప‌టికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తుంది. ప్ర‌స్తుతం ఈవీడియో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. స్వాతి అభిమానులు డీసెంట్ కామెంట్ల‌తో అభిమానం కురిపిస్తున్నారు.

గ్లామ‌ర్ ఫీల్డ్ లో! ఎంతో ప‌ద్ద‌తిగ‌ల న‌టి...నువ్వు ఇలాగే ఉండాలి..కొత్త‌గా ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చే భామ‌ల‌కు స్పూర్తిగా నిల‌వాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఈ పోటీలో స్వాతి మును ముందు ఎలా ముందుకు సాగుతుందో చూడాలి. ఎలాంటి కొత్త అవ‌కాశాలు చేజిక్కించుకుంటుందో చూడాలి.