Begin typing your search above and press return to search.

స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్ జీవిత‌క‌థ‌తో

స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్ - ఒక దార్శనికుడు.. ఫైర్‌బ్రాండ్ .. ప్ర‌చారానికి దూరంగా నిర్ల‌క్ష్యానికి గురైన చ‌రిత్ర‌కారుడు. అత‌డి జీవిత‌క‌థ‌ను వెండితెర‌కెక్కించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 8:30 AM GMT
స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్ జీవిత‌క‌థ‌తో
X

ఎంద‌రో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల జీవిత‌క‌థ‌లు వెండితెర‌కెక్కాయి. మ‌హాత్మా గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్, ఝాన్సీ ల‌క్ష్మీ భాయ్ స‌హా ప‌లువురు స‌మ‌ర‌యోధుల‌ జీవితాల‌ను వెండితెర‌కెక్కించారు మ‌న మేక‌ర్స్. ఇప్పుడు 'స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్' బయోపిక్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. భారతదేశంలోని అన్‌సంగ్ హీరో వీర్ సావ‌ర్క‌ర్‌ కి సినిమాటిక్ ట్రిబ్యూట్ థియేట్రికల్ గా విడుదలకు సిద్ధం చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ఈ చిత్రం 22 మార్చి 2024న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. జాతీయ అమరవీరుల దినోత్సవం ప్రత్యేక సందర్భంగా ఈ శుభవార్తను చిత్ర‌బృందం ప్రకటించింది.


రణ్‌దీప్ హుడా దర్శకత్వం వహించి న‌టించిన‌ తొలి చిత్రమిది. భారత స్వాతంత్య్ర‌ పోరాటంలో వీర్ సావర్కర్ తిరుగులేని వ్యక్తి. స్వాతంత్య్ర‌ వీర్ సావర్కర్ - ఒక దార్శనికుడు.. ఫైర్‌బ్రాండ్ .. ప్ర‌చారానికి దూరంగా నిర్ల‌క్ష్యానికి గురైన చ‌రిత్ర‌కారుడు. అత‌డి జీవిత‌క‌థ‌ను వెండితెర‌కెక్కించ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తాజాగా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తాజా వీడియోలో వీర్ సావ‌ర్క‌ర్ పాత్ర‌లోకి రణదీప్ హుడా పర‌కాయ ప్ర‌వేశం చేసాడంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రోసారి ర‌ణ‌దీప్ అతడి బహుముఖ ప్రజ్ఞ - అంకితభావాన్ని తెర‌పై చూడ‌బోతున్నామ‌ని ఈ విజువ‌ల్ హామీని ఇచ్చింది. సావ‌ర్క‌ర్ పాత్ర చిత్రణలో ర‌ణ‌దీప్ అంకితభావం తాజా టీజ‌ర్ లో క‌నిపించింది. ఎంపిక చేసుకున్న క‌థ‌ను ఉద్వేగభరితంగా తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది.

రణదీప్ హుడా ఇదే విషయం గురించి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, ''దాదాపు రెండేళ్ళపాటు మిస్టర్ సావర్కర్‌తో కలసి కాలాపానీలో గడిపిన తర్వాత, చివరకు అతడు స్వాతంత్య్రం వైపు అడుగులు వేసే సమయం..ప్రయాణం చాలా కష్టంగా ఉంది.. కానీ అది నన్ను నటుడిగా నన్ను మించిపోయేలా చేసింది. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడిగా ఉండటం నా అదృష్టం. మన దేశ‌ స్వాతంత్య్ర‌ పోరాటంలో సాయుధ విప్లవం అందించిన వీరుడి గురించి దేశం తెలుసుకునే సమయం ఆసన్నమైంది. సావర్కర్ ఎల్లప్పుడూ సమయానికి ముందు ఉండేవాడు.. మునుపెన్నడూ లేనంతగా నేడు మరింత సందర్భోచితంగా స‌మ‌యానికి వ‌స్తున్నాడు'' అని ర‌ణ‌దీప్ హుడా అన్నారు.

జీ స్టూడియోస్, ఆనంద్ పండిట్, రణదీప్ హుడా, సందీప్ సింగ్ , యోగేష్ రాహర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. రూపా పండిట్, సామ్ ఖాన్, అన్వర్ అలీ, పాంచాలి చక్రవర్తి సహ నిర్మాతలు. రణదీప్ హుడా, అంకితా లోఖండే,యు అమిత్ సియాల్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రం హిందీ- మరాఠీ భాషలలో 22 మార్చి 2024న విడుదల కానుంది.