Begin typing your search above and press return to search.

రాజుగారికి సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సీక్వెల్ క‌లొచ్చింది!

ఈ మ‌ధ్య దిల్ రాజు కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు క‌లగ‌న్నారు. ఉద‌యం లేచిన వెంట‌నే రాజు గారు..శ్రీకాంత్ కి ఫోన్ చేసి సీక్వెల్ చేయాల‌ని అన్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:15 AM GMT
రాజుగారికి సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సీక్వెల్ క‌లొచ్చింది!
X

మ‌హేష్‌-వెంక‌టేష్ క‌థానాయ‌కులిగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు' అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. టాలీవుడ్ లో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు పునాది వేసింది ఈసినిమానే. కుటుంబ విలువుల‌..అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఎమోష‌న‌ల్ బాండింగ్ ని హైలైట్ చేస్తూ తెర‌కెక్కించిన సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించిన చిత్రంగా నిలిచింది.

శ్రీకాంత్ కెరీర్ లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. శ్రీవెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. తాజాగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించి 'పెద‌కాపు' రిలీజ్ లో భాగంగా ప్రచార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నా ఆయ‌న సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసారు. ఈ సినిమాకి సీక్వెల్ చేయాల‌ని చాలా మంది ప్రేక్ష‌కులు అడుగుతున్నారుట‌.

ఈ మ‌ధ్య దిల్ రాజు కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్న‌ట్లు క‌లగ‌న్నారు. ఉద‌యం లేచిన వెంట‌నే రాజు గారు..శ్రీకాంత్ కి ఫోన్ చేసి సీక్వెల్ చేయాల‌ని అన్నారు. అందుకు శ్రీకాంత్ కూడా అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే చేద్దాం అనుకున్న‌ట్లు రివీల్ చేసారు. రాజుగారు లాంటి అగ్ర నిర్మాత ఆ మాట అన్నారు కాబ‌ట్టి ఇది జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. శ్రీకాంత్ కి కూడా ఇప్పుడు పెద్ద‌గా అవకాశాలు రావ‌డం లేదు.

ఆయ‌న సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తే నిర్మించ‌డానికి నిర్మాత రెడీగా ఉన్నాడు. అయితే ఆ క‌థ‌లో వెంక‌టేష్‌... మ‌హేష్ మ‌ళ్లీ న‌టిస్తారా? అన్న‌ది సందేహ‌మే. ప్ర‌స్తుతం హీరోలంతా పాన్ ఇండియా కంటెంట్ వైపు ప‌రుగులు తీస్తున్నారు. 'సైంధ‌వ్' తో వెంకీ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నారు. అలాగే ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రంతో మ‌హేష్ పాన్ ఇండియా వ‌ర‌ల్డ్ లో కి అడుగు పెడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అదే కాంబినేష‌న్ లో సీత‌మ్మ వాకిట్లో సీక్వెల్ అంటే ? హీరోలిద్ద‌రు ఆలోచించే అవ‌కాశం ఉంటుంది. అయితే ఇద్ద‌రు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని టార్గెట్ చేసిన హీరోలే. వైవిథ్య‌మైన ప్ర‌య‌త్నాల‌తో పాటు క‌మర్శియ‌ల్ కోణంలోసినిమాలు చేయాల‌ని భావించే హీరోలు. కాబ‌ట్టి ఆ కోవ‌లో ఒకే చెప్పినా చెప్పొచ్చు.