Begin typing your search above and press return to search.

ఆయన ఎమోషన్స్ కి తగ్గి.. నేను చేసిన అతిపెద్ద తప్పు అదే -ఎస్వీ కృష్ణారెడ్డి

దర్శకుడిగా సత్తా చాటిన ఎస్వీ కృష్ణారెడ్డి.. ఎంతోమంది హీరోలకు మంచి విజయాన్ని అందించారు. అలాంటి ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో నాగార్జున వజ్రం అనే రీమేక్ మూవీ చేశారు.

By:  Tupaki Desk   |   31 Aug 2025 2:00 PM IST
ఆయన ఎమోషన్స్ కి తగ్గి.. నేను చేసిన అతిపెద్ద తప్పు అదే -ఎస్వీ కృష్ణారెడ్డి
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శక ధీరుడుగా పేరు సొంతం చేసుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. దర్శకుడిగా చిత్రాలను తెరకెక్కించడమే కాదు నటుడిగా కూడా సత్తా చాటారు. చివరిగా 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఇప్పుడు 'వేదవ్యాస్' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఒక కొరియన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు కూడా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎస్వీ కృష్ణారెడ్డి మరొకవైపు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తన కెరియర్లో తాను చేసిన అతి పెద్ద మిస్టేక్ అదే అంటూ తెలిపారు.

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే - ఎస్వీ కృష్ణారెడ్డి

దర్శకుడిగా సత్తా చాటిన ఎస్వీ కృష్ణారెడ్డి.. ఎంతోమంది హీరోలకు మంచి విజయాన్ని అందించారు. అలాంటి ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్లో నాగార్జున వజ్రం అనే రీమేక్ మూవీ చేశారు. ఈ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు. అయితే ఈ సినిమా గురించి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎస్వీ కృష్ణారెడ్డి పెద్ద హీరోలను హ్యాండిల్ చేయలేడు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది.ఇది ఎంతవరకు నిజం అనే ప్రశ్న ఎదురవగా.." స్టార్స్ ని హ్యాండిల్ చేయలేడు అనేది తప్పు. కానీ నాగార్జున విషయంలో మాత్రం నేను పెద్ద మిస్టేక్ చేశాను. ఎందుకంటే నాగార్జునకు మొదట రాకుమారుడు అనే సినిమా స్టోరీ చెప్పాను. ఈ కథ నాగార్జునకు చాలా బాగా నచ్చేసి మనం వెంటనే చేసేద్దాం అని ఒప్పుకున్నారు. కానీ ప్రొడ్యూసర్ నరసారెడ్డి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పుడే దెబ్బ పడిపోయింది. ఆయన ఇలాంటి సినిమా అయితే నేను ఒప్పుకోను. నేను చాలా అప్పుల్లో ఉన్నాను అని చెప్పారు. దాంతో నాగార్జున, నేను చేసేదేమీ లేక మలయాళంలోని ఓ సినిమాని కొనుక్కొని వజ్రం సినిమాని చేశాను. మలయాళ సినిమాకి రీమేక్ గా వజ్రం సినిమా చేసినప్పటికీ ఈ సినిమా సరిగ్గా ఆడలేదు. నిర్మాత ఎమోషన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు తగ్గి, ఈ సినిమా చేయడం నేను చేసిన అతి పెద్ద తప్పు" అంటూ ఎస్ వి కృష్ణారెడ్డి తెలిపారు.

బాలకృష్ణ మూవీ వల్ల ఎవరికి నష్టం రాలేదు - ఎస్వీ కృష్ణారెడ్డి

"బాలకృష్ణతో చేసిన సినిమా టాప్ హీరో పాటలు ఆడినంతగా సినిమా ఆడలేదు. అలా అని డిస్ట్రిబ్యూటర్లకు నష్టమైతే తెచ్చి పెట్టలేదు. సినిమా కొన్ని రోజులు ఆడి డిస్ట్రిబ్యూటర్లకు నాలుగు రూపాయలు అయితే మిగిల్చింది. అలాగే స్టార్స్ ని హ్యాండిల్ చేయలేడు అని అంటే కృష్ణ లాంటి వారిని నేను ఎలా హ్యాండిల్ చేశాను. ఒక్క ఫ్లాప్ సినిమాకే అంచనా వేయలేం కదా" అంటూ చెప్పుకొచ్చారు.

అందుకే వారు నాతో సినిమా చేయలేదు -ఎస్వీ కృష్ణారెడ్డి

అలాగే చిరంజీవి,వెంకటేష్ లు అందుకే మీతో సినిమాలు చేయలేదనే టాక్ ఉంది? అని మరో ప్రశ్న ఎదురవగా "అలాంటిదేమీ లేదు.. చిరంజీవి,వెంకటేష్ లాంటి వారు వజ్రం సినిమా దృష్టిలో పెట్టుకొని డౌట్ పడ్డారు. ఆ సినిమానే సరిగ్గా చేయలేకపోయాడు. ఒకవేళ మేం ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే అదే రిజల్ట్ వస్తుందనే డౌట్ వారిలో ఉండి పోయింది అంతే. హీరోలను టేకింగ్ చేయలేడేమో అని అనుకున్నారు.కానీ నేను హీరోలను టేకింగ్ చేయకపోతే కృష్ణ, అలాగే ఓ మామూలు నటుడు అయినటువంటి ఆలీతో యమలీల సినిమా ఎలా చేశానో ఒకసారి గుర్తు తెచ్చుకోండి" అంటూ అసలు విషయం తెలిపారు ఎస్.వి.కృష్ణారెడ్డి.

భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తా -ఎస్వీ కృష్ణారెడ్డి

మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశం గురించి మాట్లాడుతూ.." చిరంజీవి గారితో చేసే అవకాశం అప్పట్లో రాలేదు.కానీ ఈ మధ్యకాలంలో అనుకున్నాం. ఒకవేళ అన్నీ ఓకే అయితే భవిష్యత్తులో సినిమా వస్తుంది కావచ్చు" అంటూ తెలిపారు ఎస్.వి. కృష్ణారెడ్డి.