Begin typing your search above and press return to search.

హృతిక్ ప్రియురాలిపై మాజీ భార్య సుస్సానే కామెంట్

ఆ ఫోటోలో అంద‌మైన జంట సాన్నిహిత్యం ఆక‌ర్షిస్తోంది. సుస్సాన్ 'అందమై ఫోటో' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   11 Aug 2023 2:30 AM GMT
హృతిక్ ప్రియురాలిపై మాజీ భార్య సుస్సానే కామెంట్
X

హృతిక్ రోషన్ -సుస్సానే ఖాన్ జంట బ్రేకప్ వ్య‌వ‌హారం తెలిసిందే. ప‌రిశ్ర‌మలో ఆద‌ర్శ జంట‌గా పాపుల‌రైన ఆ ఇద్ద‌రూ విడిపోవ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. దాదాపు రెండు ద‌శాబ్ధాల దాంప‌త్య జీవ‌నం త‌ర‌వాత ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిదండ్రులుగా ఉన్న ఆ ఇద్ద‌రూ ఇలాంటి నిర్ణ‌యాన్ని తీసుకోవ‌డం షాకిచ్చింది. ఈ జంట పరస్పర విభేదాల కారణంగా 2014లో విడిపోయారు. అయితే విడిపోయిన త‌ర్వాత కూడా ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగానే ఉన్నారు. వారి పిల్లలు హ్రేహాన్ -హృదాన్ బాధ్య‌త‌ల్ని షేర్ చేసుకుంటున్నారు.


ఇటీవ‌ల సుస్సానే నటుడు అర్స్లాన్ గోనీతో డేటింగ్ చేస్తున్న‌ట్టు బ‌హిర్గ‌తం చేయ‌గా.. హృతిక్ రోష‌న్ స్వరకర్త-నటి సబా ఆజాద్ తో ప్రేమాయ‌ణం సాగించ‌డం తెలిసిన‌దే. నిరంత‌రం ఈ జంటల‌ వెకేష‌న్స్ ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల అర్జెంటీనాలో తమ వెకేష‌న్ నుండి హృతిక్‌తో క‌లిసి ఉన్న ఫోటోను స‌బా అజాద్ షేర్ చేసారు. దానికి 'క్యూ బ్యూనో బ్యూనస్ ఎయిర్స్' అని శీర్షికను నిర్ణ‌యించారు. హృతిక్ ఒక కేఫ్ స‌మీపంలో స‌బాతో క‌లిసి సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలో అంద‌మైన జంట సాన్నిహిత్యం ఆక‌ర్షిస్తోంది. సుస్సాన్ 'అందమై ఫోటో' అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు.

'విక్రమ్ వేద'లో అద్భుత న‌ట‌న‌కు హృతిక్ పై ప్ర‌శంస‌లు కురిసాయి. త‌దుప‌రి అనిల్ కపూర్ - దీపికా పదుకొనేలతో క‌లిసి సిద్ధార్థ్ ఆనంద్ 'ఫైటర్‌'లో కనిపించనున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ - కియారా అద్వానీ జంట‌గా క‌నిపించ‌నున్నారు. హృతిక్ న‌టించిన 'కోయి…మిల్ గయా' ఇటీవలే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.