Begin typing your search above and press return to search.

కొండచిలువతో ఆటలు.. బాలీవుడ్ హీరోయిన్ సాహసాలు..!

అలాంటిది సుస్మితాసేన్ కొండచ్ చిలువని పెంచుకుంటుందట. అసలు పాములను ఎవరైనా పెంచుకుంటారా అని డౌట్ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 2:30 AM GMT
కొండచిలువతో ఆటలు.. బాలీవుడ్ హీరోయిన్ సాహసాలు..!
X

మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. మోడల్ గా కెరెర్ మొదలు పెట్టి మిస్ యూనివర్స్ కైవసం చేసుకుని ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది అమ్మడు. 1997 లో తమిళ సినిమా రత్సగన్ తో కెరీర్ మొదలు పెట్టిన సుస్మిత బాలీవుడ్ ఆడియన్స్ కి హా**ట్ ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. సౌత్ లో కూడా అడపాదడపా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది సుస్మిత. ఒకే ఒక్కడు సినిమాలో షకలక బేబీ సినిమా తో సౌత్ ని షేక్ చేసింది అమ్మడు.

సీనియర్ స్టార్ హీరోయిన్ ఈమధ్య వెబ్ సీరీస్ లతో బిజీగా అయ్యింది. రీసెంట్ గా వచ్చిన ఆర్య 3 సీరీస్ తో మరోసారి ప్రేక్షకులను అలరించింది సుస్మిత. అయితే సుస్మిత గురించి లేటెస్ట్ గా ముంబై మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అమ్మడు పెట్ గా ఒక కొండ చిలువను పెంచుకుంటుందట. ఎవరైనా సరే ఇంట్లో పెట్ గా కుక్కలను పెంచుకుంటారు కొందరు పిల్లుల్ని కూడా పెంచుకుంటారు.

అలాంటిది సుస్మితాసేన్ కొండచ్ చిలువని పెంచుకుంటుందట. అసలు పాములను ఎవరైనా పెంచుకుంటారా అని డౌట్ పడుతున్నారు. కానీ సుస్మిత సన్నిహితుల సమాచారం ప్రకారం ఆమె ఒక బుల్లి కొండచిలువను పెంచుకుంటుందట. అంతేకాదు దానితో ఆడుకుంటుందని కూడ తెలుస్తుంది. అసలు అమ్మడికి పాముని పెంచుకోవాలన్న ఐడియా ఎవరిచ్చారో కానీ ఇలా కొండచిలువను పెంచుకుంటుందంటూ సుస్మిత సేన్ గురించి సోషల్ మీడియా అంతా ఒకటే న్యూస్ వైరల్ గా మారింది.

సెలబ్రిటీస్ ఏం చేసినా సరే అదో డిఫరెంట్ గా ఉంటుంది. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతోనే సుస్మిత కూడా ఇలా పాముని పెంచుకుంటుందని అంటున్నారు. అయితే ఆమెకు క్లోజ్ గా ఉండే సన్నిహితుల ద్వారా బయటకు వచ్చిన వార్త కాబట్టి ఈ విషయంపై సుస్మిత ఏ విధంగా స్పందిస్తుంది అన్నది చూడాలి. సుస్మిత కొండచిలువను పెంచుకుంటుందా అంటూ సోషల్ మీడియాలో ఆమె గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తన ప్రతి విషయంలో మరొకరి అభిప్రాయం గురించి అసలు పట్టించుకోనని ధైర్యంగా చెప్పే సుస్మిత ఈ కొండచిలువ పెంపకం లో కూడా ఎవరి మాట లెక్క చేయదని ఆమెకు చెందిన కొందరు చెబుతున్న మాట.