Begin typing your search above and press return to search.

రియ‌ల్ హిజ్రాల‌తో సుస్మితాసేన్ ప్రాక్టీస్!

ఈ పాత్ర గురించి ద‌ర్శ‌కుడు చెప్ప‌గానే వాస్త‌వ హిజ్రాల్ని క‌లిసి వాళ్ల‌తో పాటు కొన్ని రోజులు ప్ర‌యాణం సాగించిందిట‌.

By:  Tupaki Desk   |   12 Aug 2023 10:38 AM GMT
రియ‌ల్  హిజ్రాల‌తో సుస్మితాసేన్ ప్రాక్టీస్!
X

మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్ హిజ్రా పాత్ర‌లో 'తాలి' అనే వెబ్ సిరీస్ లో పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సుస్మితా సేన్ కెరీర్ లోనే వైవిథ్య‌మైన పాత్ర. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఆమె ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో హిజ్రా గెట‌ప్ లో అద‌ర‌గొట్టేసింది. సాధార‌ణంగా హిజ్రా పాత్ర‌లు మేల్స్ పోషిస్తుంటారు. కానీ 'తాలి' కోసం తానే హిజ్రా అవ‌తారంలోకి మారిపోయింది. హిజ్రా ఆహార్యంలో ఒదిగిపోవ‌డంతో లుక్ కి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. క‌ట్టు..బొట్టు..ఆహార్యం... ఆ ముఖంలో రౌద్రం అచ్చంగా హిజ్రానే త‌ల‌పించింది సుస్మితా సేన్.

అయితే ఇదంతా ఈజీ కాదు. ఆ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా స‌న్న‌ద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ పాత్ర గురించి ద‌ర్శ‌కుడు చెప్ప‌గానే వాస్త‌వ హిజ్రాల్ని క‌లిసి వాళ్ల‌తో పాటు కొన్ని రోజులు ప్ర‌యాణం సాగించిందిట‌. వాళ్ల జీవిన విధానం ఎలా ఉంటుంది. ఇళ్ల‌లో ఎలా ఉంటారు? ముస్తాబు అవ్వ‌డం ద‌గ్గ‌ర నుంచి రోడ్ల‌పైకి వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొట్టే వ‌ర‌కూ ప్ర‌తీ విష‌యాన్ని ఎంతో క్షుణ్ణంగా ప‌రిశీలించిందిట‌.

ముఖ్యంగా హిజ్రాలు చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం చాలా కొత్త‌గా ఉంటుంది. సాధార‌ణ చ‌ప్ప‌ట్లకు..వాళ్లు కొట్టే చ‌ప్ప‌ట్ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంటుంది. చప్పట్లు కొట్టేటప్పుడు రెండు చేతులు నిలువుగా లేదా అడ్డంగా ఉంచి చప్పట్లు కొడతారు. అయితే హిజ్రాలు చప్పట్లు కొట్టేటప్పుడు ఒక చేతిని నిలువుగా.. మరో చేతిని అడ్డంగా ఉంచి చప్పట్లు కొడతారు. ఈ సమయంలో వారి చేతుల వేళ్లు దూరంగా ఉంటాయి.

ఈ క్లాప్ నుంచి ఒక ప్రత్యేక రకమైన ధ్వని వస్తుంది. ఇది చాలా పెద్దగా వినిపిస్తుంది. అలాంటి ధ్వ‌ని కేవ‌లం ఆ ర‌కంగా చేతులు జోడించి కొడితోనే వ‌స్తుంది. అలా కొట్ట‌డం వ‌ల్ల చేతులు కూడా నొప్పి రావు.బొబ్బి కూడా క‌ట్ట‌ద‌ట‌. ఈ చ‌ప్ప‌ట్ల‌కు ప్ర‌త్యేక‌మైన సిగ్న‌లింగ్ కూడా ఉంది. పెళ్లిళ్లలో లేదా పండుగల్లో హిజ్రాలు చప్పట్లు కొడుతూ తమ ఆశీస్సులు అందజేస్తుంటారు.

హిజ్రాలు కొట్టే చప్పట్లు వారి గుర్తింపునకు సంబంధించినవి. ఈ చప్పట్లకు ప్రత్యేక అర్థం కూడా ఉందిట‌. ప్రత్యేక శబ్ధంతో చప్పట్లు కొట్టడం ద్వారా హిజ్రా.. మరొక హిజ్రాని గుర్తిస్తారుట‌. హిజ్రాలు చప్పట్లు కొట్టేటప్పుడు ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారుట‌. ఈ విష‌యాల‌న్నింటిని సుస్మితా సేన్ వాళ్ల జ‌ర్నీలో భాగంగా గుర్తించారుట‌.