Begin typing your search above and press return to search.

ప్రాజెక్ట్ క్యాన్సిల్.. మెగా డాటర్ కు నష్టం ఎంతంటే..

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు

By:  Tupaki Desk   |   2 Oct 2023 4:54 AM GMT
ప్రాజెక్ట్ క్యాన్సిల్.. మెగా డాటర్ కు నష్టం ఎంతంటే..
X

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో వరుస సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ నుంచి కమర్షియల్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. వాటిలో ఆచార్య, భోళా శంకర్ డిజాస్టర్ కాగా, గాడ్ ఫాదర్ ఎవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక సెకండ్ ఇన్నింగ్ లో మెగాస్టార్ చేసిన ఐదు చిత్రాలలో మూడు రీమేక్ మూవీస్ కావడం గమనార్హం.

ఈ రీమేక్ సినిమాలు మెగాస్టార్ ఇమేజ్ కి కాస్తా ప్రతిబంధకంగా మారాయి. భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో బ్రో డాడీ రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ చిత్రంతో మెగాస్టార్ కూతురు సుస్మితని నిర్మాతగా నిలబెట్టాలని అనుకున్నారు. మూవీ స్క్రిప్ట్ వర్క్ జరిగింది. వీలైనంత వేగంగా ఈ చిత్రం కంప్లీట్ చేసి సంక్రాంతి రేసులో రిలీజ్ చేయాలని భావించారు.

అయితే భోళా శంకర్ సినిమా కళ్యాణ్ కృష్ణ మూవీపైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రీమేక్ కథలతో సినిమాలు చేస్తే ఆడియన్స్ చూడటం లేదని క్లారిటీ వచ్చింది. ఏదో అద్భుతంగా ఉంటేనే తప్ప ప్రేక్షకులు యాక్సప్ట్ చేసేందుకు సిద్ధంగా లేరని మెగాస్టార్ భావించి కళ్యాణ్ కృష్ణతో అనుకున్న ప్రాజెక్ట్ ఆపేశారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీని ముందుకి తీసుకొచ్చారు.

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. అయితే సుస్మిత నిర్మాణంలో చేద్దామని అనుకున్న ఆ ప్రాజెక్ట్ రద్దు కావడంతో కోటి రూపాయిల వరకు ఆమె నష్టపోయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్, రైటింగ్ అంతా ప్రసన్న కుమార్ బెజవాడ చూసుకున్నారు. ప్రస్తుతం అతనికున్న మార్కెట్ వలన రెమ్యునరేషన్ గట్టిగానే ఇచ్చారు. అయితే సినిమా క్యాన్సిల్ కావడంతో రైటింగ్ కోసం సుస్మిత చెల్లించిన మొత్తం నష్టపోవాల్సి వచ్చింది.

ఇలా సినిమా ప్రారంభం కాకుండానే కోటి రూపాయిలు మెగాస్టార్ కారణంగా కూతురు సుస్మిత పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వేరొక కథపై కళ్యాణ్ కృష్ణ వర్క్ చేస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఈ కొత్త కథతో దర్శకుడు మెగాస్టార్ ని మెప్పించగలుగుతాడా అనేది చూడాలి.