సుష్.. 8 గం.లకు ఓసారి స్టెరాయిడ్ తీసుకోకపోతే?
ఈ కథంతా ఒక వైపు.. సుష్ గురించి బయటి ప్రపంచానికి తెలియని మరో కథ కూడా ఉంది. ఈ కథ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. షాక్ కి గురి చేస్తుంది.
By: Tupaki Desk | 2 July 2025 2:00 AM ISTసాహసోపేతమైన నిర్ణయాలతో సంచలనాలకు తెర తీయడం కొందరికే చెల్లింది. ఈ కేటగిరీకే చెందుతుంది సుస్మితాసేన్. రెండు దశాబ్ధాల క్రితం విశ్వసుందరిగా ఆవిర్భవించిన సుస్మితాసేన్ తన జీవితంలో చాలామంది అందాల రాణులను రూపొందించిన మేటి ధీశాలి. పలువురు హీరోలతో డేటింగులు చేసిన సుస్మితాసేన్ చివరికి ప్రేమ వైఫల్యం కారణంగా పెళ్లికి దూరంగా ఉండిపోయింది. అంతేకాదు 24 సంవత్సరాల వయసులోనే పిల్లలను దత్తతకు తీసుకోవాలనే నిర్ణయంతో సంచలనం సృష్టించింది. సుష్ కొందరు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనాపాలనా చూస్తోంది. వారు పెరిగి పెద్దవాళ్లయ్యారు. ఇక మోడల్ రోహన్ షాల్‌తో లేటు వయసులో డేటింగ్ చేస్తూ చర్చనీయాంశమైంది.
ఈ కథంతా ఒక వైపు.. సుష్ గురించి బయటి ప్రపంచానికి తెలియని మరో కథ కూడా ఉంది. ఈ కథ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. షాక్ కి గురి చేస్తుంది. నాణేనికి మరోవైపు చాలా ప్రమాదకరమైన జీవితం ప్రత్యక్షమవుతుంది. నిజానికి నిరంతరం ఉల్లాసంగా ఎనర్జిటిగ్గా కనిపించే సుస్మితాసేన్, అనారోగ్యంతో చాలా కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని ఎవరికీ తెలీదు. ఇటీవల నటనా కెరీర్ లో బిజీ అయిన సుస్మితాసేన్ ఈరోజు ఇలా జీవించి ఉండగలిగింది అంటే.. దానికి కారణం ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి విధిగా స్టెరాయిడ్ తీసుకోవడమే కారణమనే విషయం ఎవరికైనా తెలుసా?
2023లో భారీ గుండెపోటుకు గురైన తర్వాత ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి హైడ్రోకార్డిసోల్ అనే స్టెరాయిడ్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. తన శరీరంలో కార్డిసోల్ హార్మోన్ ఉంది. దానివల్ల అడ్రినల్ గ్రంథులు పని చేయవు. అవి స్రావాలను ఉత్పత్తి చేయవు. ఇది ప్రాణాంతకమైనది. దీనిని సరి చేయాలంటే, ప్రతి ఎనిమిది గంటల కోసారి హైడ్రో కార్టిసోన్ అనే స్టెరాయిడ్ ని ఇంజెక్ట్ చేయాలి. అలాగే ఇష్టానుసారం బరువైన పనులు, వ్యాయామాలు కూడా చేయకూడదు. కానీ సుస్మితాసేన్ వైద్యుల సూచనలకు భిన్నంగా ప్రవర్తించింది. తన ఫిట్నెస్ కోచ్ ని పిలిచి జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసింది. సుష్ యాంటి గ్రావిటీ వ్యాయామాలు చేసింది. ఎరోప్లేన్ ఫిట్నెస్ సెషన్స్ కి అటెండయింది. డిటాక్సిఫికేషన్ ప్రారంభించింది. ఇంకా చాలా ట్రై చేసింది.
కానీ అకస్మాత్తుగా ఒకరోజు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆ సమయంలో దుబాయ్ నుంచి అబుదబీ తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత టర్కీ నుంచి వైద్యుడు ఒకరు ఫోన్ చేసి సుస్మితాసేన్ జీవితంలో మిరాకిల్ జరిగిందని చెప్పారు. ఇప్పుడు తన అడ్రినల్ గ్రంధి సవ్యంగా పని చేస్తోంది. ఆల్రెడీ పని చేయకుండా పోయినది తిరిగి పని చేయడం తన 35 ఏళ్ల కెరీర్ లో చూడలేదని ఆ డాక్టర్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. సుస్మితకు చివరికి స్టెరాయిడ్ తో పని లేకుండా జీవించే అవకాశం లభించింది. ఇది నిజంగా మెడికల్ హిస్టరీలో ఒక సంచలనం.
