Begin typing your search above and press return to search.

ఈ పాపుల‌ర్ న‌టి దుబాయ్ బంగారు బాతు!

దుబాయ్ లో ''ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డుల''కు గౌరవ అతిథిగా హాజరైన సుష్ దుబాయ్ న‌గ‌రాన్ని త‌న‌దైన శైలిలో ప్ర‌శంసించింది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 4:00 AM IST
ఈ పాపుల‌ర్ న‌టి దుబాయ్ బంగారు బాతు!
X

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి, వ్యవస్థాపకురాలు సుష్మితా సేన్ మొదటిసారి దుబాయ్‌కు వచ్చినప్పుడు ఆ న‌గ‌రంతో త‌న త‌ల్లి అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. త‌న త‌ల్లి సుబ్ర సేన్ చాలా కాలంగా దుబాయ్ లో ఆభ‌ర‌ణాల వ్యాపారం చేస్తున్నార‌ని కూడా గుర్తు చేసింది. 1999లో స్థాపించిన దుబాయ్ ఆధారిత లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్‌కు స‌హ‌యజమాని.. బ్రాండ్ అంబాసిడర్ గాను సుష్ ప‌ని చేస్తోంది.

ఇద్దరు పిల్లలకు ఒంటరి తల్లిగా, నటిగా, తల్లిగా, ఇప్పుడు వ్యవస్థాపకురాలిగా నిరంతరం త‌న‌ను తాను ఆవిష్కరించుకున్న‌ మాజీ విశ్వ‌సుంద‌రి సుస్మితాసేన్. సుష్ లగ్జరీ జ్యువెలరీ వెంచర్ లో పెట్టుబ‌డులను స‌మీక్షించింది. త‌న‌ కుమార్తె పేరు మీద కంపెనీ ప్రారంభించాన‌ని కూడా తెలిపింది. నా తల్లి సుబ్రా సేన్ ఇక్కడ నివసిస్తుంది. ఆమె రెనీ జ్యువెలర్స్‌ను ప్రారంభించింది. అమ్మ‌, ఆమె భాగస్వామి నీరజ్ అంకుల్ ఇక్కడే కాదు, అన్ని జీసీసీ దేశాలలో ఇంత పెద్ద విజయాన్ని సాధించారు. కాబట్టి నాకు ఇది దుబాయ్ ఇప్పుడు సొంత ఇల్లు.. అని వ్యాఖ్యానించింది సుష్‌. దేవుడి ద‌య‌వ‌ల్ల దుబాయ్ లో స‌గం మ‌న భార‌తీయులే ఉన్నారు. కాబట్టి అక్కడ న్యాయంగా ఉందాం. భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, నేపాలీల మధ్య మనమంతా ఇక్కడ ఉన్నాము. కానీ మధ్యప్రాచ్యం ఎల్లప్పుడూ ఇది నా ఇల్లు అనిపించేలా చేస్తుంద‌ని సుస్మితా సేన్ అన్నారు.

దుబాయ్ లో ''ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డుల''కు గౌరవ అతిథిగా హాజరైన సుష్ దుబాయ్ న‌గ‌రాన్ని త‌న‌దైన శైలిలో ప్ర‌శంసించింది. ఈ సంస్థ న‌ర్సుల‌ను త‌యారు చేస్తుంది. మొదటిసారి 25,000 మంది దరఖాస్తు చేసుకున్నట్లే, ఈ సంవత్సరం 1,05,000 మంది నర్సులను త‌యారు చేసింద‌ని తెలిపింది.

న‌ట‌నా కెరీర్ విష‌యానికి వ‌స్తే, 50 ఏళ్ల వయసులో సుస్మితా సేన్ తెరపై అలుపెర‌గ‌ని ప్ర‌యోగాలు చేస్తోంది. 'ది గాడ్‌ఫాదర్‌'తో పోల్చిన‌ క్రైమ్ డ్రామా 'ఆర్య'లో బోల్డ్ లీడ్‌గా న‌టించింది. మైఖేల్ కార్లియోన్ స్త్రీ వెర్షన్ లో అద్భుతంగా నటించింది.