పెళ్లి కాకుండా పిల్లల దత్తత.. ఈ నటి తండ్రి ఆదర్శం!
దత్తత సమయంలో కోర్టులో కూడా సుస్మిత పోరాడింది. ఆ రోజు న్యాయమూర్తి నన్ను చూసి ..నా 38 సంవత్సరాల ప్రాక్టీస్‌లో.. నేను ఈ రోజు ఈ ఆర్డర్‌పై సంతకం చేస్తే ఇది చరిత్ర.
By: Tupaki Desk | 27 Jun 2025 9:45 AM ISTఎదిగిన పిల్లలు ఏదైనా చేయాలని అనుకుంటే అడ్డు పుల్ల వేయకుండా వీలైనంతగా తల్లిదండ్రులు సహకరిస్తే, అందులో విజయం దక్కుతుంది. అలా కాకుండా అది మనకు ఎందుకులే! అని నిరాశపరిస్తే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పిల్లల భవిష్యత్ ఉంటుంది.
24 ఏళ్ల వయసులో ఏ యువతి అయినా పెళ్లి గురించి ఆలోచించకుండా, పిల్లల్ని దత్తత తీసుకుంటానని తన ఇంట్లో అడిగితే ఒప్పుకుంటారా? అసలు ఏ తండ్రి అయినా దీనిని ఒప్పుకోగలడా? ... సరిగ్గా తన తండ్రి కూడా అలాంటి వాడేనని అన్నారు సుస్మితా సేన్. కేవలం 24 సంవత్సరాల వయసులో తన కుమార్తె రెనీని దత్తత తీసుకోవడం ఒక సంచలనం.
దత్తత సమయంలో కోర్టులో కూడా సుస్మిత పోరాడింది. ఆ రోజు న్యాయమూర్తి నన్ను చూసి ..నా 38 సంవత్సరాల ప్రాక్టీస్‌లో.. నేను ఈ రోజు ఈ ఆర్డర్‌పై సంతకం చేస్తే ఇది చరిత్ర. మీరు ఈ పని (పెంపకం) సరిగ్గా చేయకపోతే మీతో పాటు నేనూ బాధ్యుడినే అని జడ్జి అన్నారు. ఆ తర్వాత సుస్మితాసేన్ తండ్రిని జడ్జి ఇలా అడిగారు.``మిస్టర్ సేన్, మీ కుమార్తె వివాహానికి ముందు దత్తత తీసుకుంటున్నారు.. ఈ నిర్ణయంతో ప్రతిదీ ప్రభావితమవుతుందని మీకు తెలుసు.... మీరు దానికి అంగీకరిస్తున్నారా? అని పీసీ తండ్రిని ప్రశ్నించారు.
జడ్జి ప్రశ్నకు సుస్మితాసేన్ తండ్రి ఇలా అన్నారు. మేం ఆమెను ఒకరి భార్య అనే ఏకైక గుర్తింపు కోసం పెంచలేదు. ఆమె దీనిని ఎంపిక చేసుకుంది.. మాతృత్వం - నా కుమార్తె దీనిని అనుసరిస్తే నా మద్ధతు తనకు ఉంది.. ఆమెకు ఆమె తల్లి ఉంది. ఆమెకు కుటుంబం ఉంది. మాకు రెనీని ఇవ్వండి`` అని అన్నారు. ఆ క్షణం సుష్మితకు అది ఎంతో బలంగా నిలిచింది. తన తండ్రి వేసిన ముద్రను పీసీ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది.
ఈ రోజు సుష్మితకు ఇద్దరు కుమార్తెలు.. రెనీ, అలీసా. సేన్ చాలా మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. కానీ ఆ ప్రయాణాన్ని సాధ్యం చేసింది ఆమె ధైర్యం మాత్రమే కాదు.. ఆమె తండ్రి వెన్ను దన్ను. కూతురుపై ప్రేమ ఆమెకు బలంగా మారింది. పిల్లల విషయంలో ప్రేమను, అంగీకారాన్ని దాచకూడదని కూడా సుస్మితా సేన్ తెలిపారు. దాచి పెడితే వారు ధృఢంగా మారుతారనేది తప్పుడు ఆలోచన అని అన్నారు.
