Begin typing your search above and press return to search.

మ‌ర‌ణానికి ముందు ఫోన్‌కి దొర‌క‌ని హీరో!

వారిలో 'కై పో చే' సహనటుడు అమిత్ సాద్ ఇటీవల సిద్ధార్థ్ కన్నన్‌తో జ‌రిగిన‌ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   15 Nov 2023 12:30 PM GMT
మ‌ర‌ణానికి ముందు ఫోన్‌కి దొర‌క‌ని హీరో!
X

టీవీ హోస్ట్ గా కెరీర్ ప్రారంభించి, అటుపై హీరోగా వెండితెరను ఏలిన ప్ర‌ముఖ హీరో అనుమానాస్ప‌ద మృతి ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే మిగిలింది. దీనిపై ఏళ్ల త‌ర‌బ‌డి విచార‌ణ సాగుతున్నా నిజం ఏమిటో తేల‌లేదు. చివ‌రికి ఈ కేసుతో ముడిప‌డిన‌ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో అరెస్ట‌యిన వారంతా బెయిల్ పై బ‌య‌టికి వ‌చ్చేశారు. అదంతా అటుంచితే అతడి మ‌ర‌ణానికి ముందు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఫోన్ కాల్‌కి దొర‌క‌లేద‌ని త‌న స్నేహితుడు, స‌హ‌న‌టుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. అతడి మ‌ర‌ణ‌వార్త తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని అన్నారు. ఈ ఎపిసోడ్ లో అనుమానాస్ప‌ద మృతి చెందిన హీరో ఎవ‌రు? అంటే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. క‌ల‌త‌కు గురైన న‌టుడు అమిత్ సాధ్.

14 జూన్ 2020న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనూహ్య మరణంతో.. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సుశాంత్ అభిమానులు దానిని జీర్ణించుకోలేక‌పోయారు. ఎం.ఎస్.ధోని న‌టుడిని కోల్పోయినందుకు క‌ల‌త చెందారు. వారిలో 'కై పో చే' సహనటుడు అమిత్ సాద్ ఇటీవల సిద్ధార్థ్ కన్నన్‌తో జ‌రిగిన‌ ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశారు. సుశాంత్ తో ఆ స‌మ‌యంలో మాట్లాడ‌లేక‌పోయినందున‌ తాను అసంతృప్తిగా ఉన్నాన‌ని, నిరాశకు గురయ్యానని అమిత్ అన్నారు. ఫోన్ చేయ‌డానికి ఎంత‌గా ప్ర‌య‌త్నించినా సుశాంత్ ట‌చ్ లోకి రాలేద‌ని చెప్పాడు. తన దివంగత స్నేహితుడి గురించి మాట్లాడుతూ అత‌డు దుఃఖానికి గుర‌య్యాడు. అమిత్ సాద్ అతడిని 'ఎప్పటికీ మరచిపోలేని' తన 'సోదరుడు' అని పేర్కొన్నాడు. 2013 హిట్ చిత్రం 'కై పో చే'లో సుశాంత్- అమిత్ సాద్ మంచి స్నేహితులుగా నటించారు. ఇందులో సుశాంత్ ఇషాన్ భట్ పాత్రను పోషించారు. అమిత్ సాద్ ఓమీగా, రాజ్‌కుమార్ రావు గోవింద్ పటేల్ గా న‌టించారు.

"సుశాంత్ మ‌ర‌ణం న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అత‌డి విష‌యంలో నాకు అపరాధ భావన లేదు కానీ అతనిని సంప్రదించడానికి మార్గం లేనందుకు నిరుత్సాహపడ్డాను. విచారం క‌లిగింది. ఆ ఘ‌ట్టం నన్ను కూడా ప్రభావితం చేసింది. ఈ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని నేను గ్రహించాను" అని అమిత్ సాద్ అన్నారు. ఆ దురదృష్టకర సంఘటన కారణంగా ఈ రోజు పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు తన స్నేహితులను క‌లుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అమిత్ చెప్పాడు. ఐదారు నెలల నుండి నా స్నేహితులు నాకు కాల్ చేయకపోతే, నేను వారు ఎక్క‌డున్నారో తనిఖీ చేసి నేరుగా వారి ఇంటికి వెళ్తాను. అది మనమంతా చేయాలని నేను నమ్ముతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకూడదు. మనం ఒకరి కంటే మెరుగ్గా ఉండగలమని భావించండి. మనది పరిశ్రమగా చూస్తే ఒకే కుటుంబం. మేము ఒక‌రితో ఒక‌రం వాదించుకోవచ్చు. కానీ పరిశ్రమలో ఏం జరిగినా పరిశ్రమలోనే అన్నీ ఉండాలి. ఈ రంగం మరింత ఐక్యంగా మారాలని నేను నమ్ముతున్నాను. ఇక్క‌డ‌ అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు.. అని అమిత్ సాద్ అన్నారు.

సినీ పరిశ్రమను సంబంధాల గురించి ప్ర‌స్థావిస్తూ.. ఇక్క‌డ ఒక‌రి నుంచి ఒకరు దూరంగా ఉంటారని అమిత్ అన్నారు. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు నిరంతరం సమాచారాన్ని లీక్ చేస్తారని, ఒకరినొకరు గౌరవించుకోరని అన్నారు. పరిశ్రమలోని నిపుణులు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో తెలియకపోతే ప్రేక్షకులు తమను ఆదరిస్తారని ఆశించడం సరికాదని అమిత్ పేర్కొన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు

14 జూన్ 2020న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన తర్వాత, అత‌డు త‌న జీవితాన్ని ముగించుకోవడానికి ప్రయత్నించిన సమయాన్ని ఇప్పుడు అమిత్ గుర్తు చేసుకున్నారు. అత‌డు మాట్లాడుతూ, "నేను 16 -18 సంవత్సరాల మధ్య నాలుగు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాను కాబట్టి నేను మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాను" అని అన్నాడు. అమిత్ OTT స్పేస్‌లో బాగా రాణిస్తున్నాడు. సినీరంగంలోను వేగంగా ఎదుగుతున్న ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్.