Begin typing your search above and press return to search.

భోళా అతనికి మైలేజ్ ఇస్తుందా..?

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ సోలో హీరోగా చేస్తూనే వెరైటీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   8 Aug 2023 2:11 PM GMT
భోళా అతనికి మైలేజ్ ఇస్తుందా..?
X

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ సోలో హీరోగా చేస్తూనే వెరైటీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నాడు. హీరోగా చేస్తూ వేరే హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేయడం అన్నది కెరీర్ కి పెద్ద రిస్క్ అని తెలిసినా సరే కాంబినేషన్స్ అలా సెట్ అవుతుండటంతో కాదనలేక సరే అనేస్తున్నాడు సుశాంత్. అయితే మరొకరికైతే ఏమో కానీ అది సుశాంత్ కి మంచి మైలేజే ఇస్తుందని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యామిలీ హీరోగా నాగార్జున మేనల్లుడిగా ఆడియన్స్ లో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ అంతకుముందు కేవలం తన సినిమాలతోనే ఆడియన్స్ ముందుకు వచ్చే వాడు.

అయితే ఇలా స్టార్ సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ కి ఓకే చెప్పడంతో అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలో నటించిన సుశాంత్ ఆ సినిమా హిట్ సూపర్ గా ఎంజాయ్ చేశాడు. అల వైకుంఠపురములో సినిమా సుశాంత్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ త్రివిక్రం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మళ్లీ సోలో హీరోగా ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా చేసిన సుశాంత్ ఆ తర్వాత మళ్లీ మాస్ మహరాజ్ రవితేజతో రావణాసుర సినిమాలో నటించాడు. ఆ సినిమాలో కూడా తనకు మంచి పాత్ర పడింది కానీ సినిమా సక్సెస్ అవ్వలేదు.

ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో కీర్తి సురేష్ కి జోడీగా నటిస్తున్నాడు సుశాంత్. సినిమాలో అతని పాత్రకు కూడా మంచి స్కోప్ ఉందని తెలుస్తుంది. అందుకే చిరు మిగతా భోళా శంకర్ టీం తో సుశాంత్ కూడా యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ రావడం తన అదృష్టం అని చెబుతున్న సుశాంత్ ఈ సినిమా తన కెరీర్ కు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు.

మెగా సినిమాతో సుశాంత్ మైలేజ్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది పక్కన పెడితే.. ఇదివరకు కన్నా ఈమధ్య సుశాంత్ తరచు సినిమాల్లో కనిపిస్తున్న కారణాల వల్ల ఒక మంచి కథ దొరికే ఛాన్స్ ఉంటుంది. చిలసౌ లానే మరో ప్రయత్నాన్ని చేయాలని చూస్తున్న సుశాంత్ కి డైరెక్టర్ దొరకట్లేదని టాక్. మొత్తానికి అక్కినేని హీరోల్లో సుశాంత్ కూడా కెరీర్ నిలబెట్టుకునే ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పొచ్చు. భోళా శంకర్ వర్క్ అవుట్ అయితే స్టార్ సినిమాల్లో ఇలాంటి పాత్రలకు సుశాంత్ మొదటి ఆప్షన్ అయ్యి అతని డిమాండ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది.