Begin typing your search above and press return to search.

సుశాంత్ ఈసారి గట్టి ప్లానింగ్ తోనే..!

సంజీవని క్రియేషన్స్ బ్యానర్ లో వరుణ్ కుమార్, రాజ్ కుమార్ కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సుశాంత్ 10వ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 5:00 AM IST
సుశాంత్ ఈసారి గట్టి ప్లానింగ్ తోనే..!
X

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ 2021 లో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా చేశాడు. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. అల వైకుంఠపురములో, భోళా శంకర్, రావణాసుర సినిమాల్లో నటించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అందుకే ఆఫ్టర్ షార్ట్ గ్యాప్ మళ్లీ తన సోలో సినిమాతోనే రాబోతున్నాడు సుశాంత్. ఈసారి యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్నాడని తెలుస్తుంది. సుశాంత్ 10వ సినిమా అప్డేట్ అతని బర్త్ డే మార్చి 18న వచ్చింది. ఈ సినిమాను పృధ్విరాజ్ చిట్టేటి డైరెక్ట్ చేస్తున్నాడు.

సంజీవని క్రియేషన్స్ బ్యానర్ లో వరుణ్ కుమార్, రాజ్ కుమార్ కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో సుశాంత్ 10వ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సుశాంత్ ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా గట్టి ప్లానింగ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ తోనే సుశాంత్ అదరగొట్టాడు. హీరోగా కాస్త గ్యాప్ ఇచ్చి స్టార్ సినిమాల్లో వెయిట్ ఉన్న పాత్రలు వేస్తూ వచ్చాడు. ఐతే అవేవి సుశాంత్ కి సంతృప్తిని ఇవ్వలేదు. ఆడియన్స్ కూడా సుశాంత్ అలా సైడ్ రోల్స్ చేయడం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు.

అందుకే ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అదిరిపోయే కథతో వస్తున్నాడని తెలుస్తుంది. సుశాంత్ స్క్రిప్ట్ దశలోనే సినిమా గురించి చాలా ఎగ్జైట్ అవుతున్నాడని తెలుస్తుంది. అందుకే మార్కెట్ పెద్దగా లేకపోయినా ఈసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాలని చూస్తున్నాడు. అక్కినేని హీరోల్లో సుశాంత్ కూడా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. అప్పట్లో హీరోగా వరుస సినిమాలు చేసిన సుశాంత్ కాస్త గ్యాప్ ఇచ్చాడు.

ఐతే సినిమాలు చేస్తుంటేనే ఏదో ఒక మంచి కథ పడి సక్సెస్ వస్తుంది. అందుకే సుశాంత్ కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తున్నాడు. సుశాంత్ 10వ సినిమా ఎలా ఉంటుంది. అసలు ఎలాంటి సినిమాతో వస్తున్నాడు అన్నది ఆ ప్రాజెక్ట్ నుంచి ఏదైనా టీజర్ వస్తే తెలుస్తుంది. యువ దర్శకుడిగా పృథ్వీరాజ్ ఈసారి సుశాంత్ కి సూపర్ హిట్ ఇచ్చి తీరుతా అనే కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మరి ఈ కాంబో ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి. సుశాంత్ కూడా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి వరుస సినిమాలు చేయాలని ఉత్సాహపడుతున్నారు.