Begin typing your search above and press return to search.

సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ ద‌ర్యాప్తు ఇంకెన్నాళ్లు?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్ట‌రీపై విచార‌ణ‌ ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ న‌త్త‌న‌డ‌క‌నే సాగుతోంది. ఎన్సీబీ-సీబీఐ ద‌ర్యాప్తులు సాగినా ఎవ‌రూ దేనినీ నిర్థారించ‌లేదు.

By:  Tupaki Desk   |   11 Oct 2023 4:58 AM GMT
సుశాంత్ సింగ్ డెత్ మిస్ట‌రీ ద‌ర్యాప్తు ఇంకెన్నాళ్లు?
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ మిస్ట‌రీపై విచార‌ణ‌ ఏళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టికీ న‌త్త‌న‌డ‌క‌నే సాగుతోంది. ఎన్సీబీ-సీబీఐ ద‌ర్యాప్తులు సాగినా ఎవ‌రూ దేనినీ నిర్థారించ‌లేదు. ఇది ఆత్మ‌హత్య‌నా? లేక అనుమానాస్ప‌ద మృతినా? అన్న‌దానికి ఎలాంటి స్ప‌ష్ఠ‌తా లేదు. అయితే ఇన్నేళ్ల పాటు ద‌ర్యాప్తు సంస్థ‌లు తాత్సారం చేస్తుంటే విసిగిపోయిన అభిమానులు సోష‌ల్ మీడియాల్లో నిలదీస్తున్నారు.

ఇంత‌లోనే సుశాంత్ సింగ్ సోద‌రి శ్వేతాసింగ్ కీర్తి త‌న సోద‌రుడికి జ‌రిగిన అన్యాయానికి న్యాయం చేయాల‌ని కోరారు. సుశాంత్ అభిమాని అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా శ్వేతాసింగ్ వివ‌ర‌ణ ఇచ్చారు. విచార‌ణ విష‌య‌మై సీబీఐని అప్‌డేట్‌లు కోరడం, అధికారులకు లేఖ‌లు రాయడం, మీడియా ఒత్తిడిని సృష్టించడం వంటివి మీరు చేస్తున్నారా? అని సుశాంత్ సోద‌రిని ఒక‌ అభిమాని ప్రశ్నించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ప‌రిశోధ‌న‌లో చేర్చేందుకు తాము ఇప్పటికే చాలా కష్టపడ్డామని, ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారా అని అడిగామని శ్వేత ఆ అభిమానికి వివరించారు. సుశాంత్ మృతి కేసు డ్రగ్స్ కోణంతో సహా అనేక మలుపులు తిరిగింది. అయితే ఇంకా ఎవరూ దోషుల‌ను క‌నుగొన‌లేదు. సుశాంత్ స్నేహితురాలు రియా చ‌క్ర‌వ‌ర్తిపై సుశాంత్ తండ్రి ఆరోపించినా కానీ ఇప్పుడు రియా చక్రవర్తి బెయిల్ పై బ‌య‌టే ఉన్నారు. చట్టపరమైన చర్యలను ఎదుర్కొన్నారు కానీ తర్వాత విడుదలయ్యారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఇటీవల దివంగత న‌టుడు సుశాంత్‌కి న్యాయం కోసం ప్ర‌శ్నిస్తూ.. అభిమాని వ్యక్తం చేసిన ఆందోళనలను, త‌ప‌న‌ను తాజా చిట్ చాట్ లో ప్రస్తావించింది. రియా చక్రవర్తి ఇటీవలి ఇంటర్వ్యూలో త‌న‌ను అర్థం చేసుకునేంత గొప్ప మ‌నుషులు లేర‌ని వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్ కి ప్రతిస్పందనగా శ్వేత షేర్ చేసిన‌ రహస్య పోస్ట్‌ను అనుసరించి, సుశాంత్‌కు న్యాయం చేయడంలో పురోగతి ఉందా? ఖచ్చితమైన చర్యలు తీసుకుంటున్నారా? అని ఒక అభిమాని ప్రశ్నించారు.

త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లో శ్వేత తన సోదరుడు సుశాంత్‌పై చేసిన ఆరోపణల గురించి తన భావాలను వ్యక్తం చేస్తూ అతడికి చెందిన అన్ నోన్ ఫోటోలను షేర్ చేసారు. శ్వేతా ఇందులో ఇలా రాసింది. "ఇక తనను తాను రక్షించుకోలేని వ్యక్తిని నిందించలేం. మీ మనస్సాక్షికి మీరు ఏమి సమాధానం ఇస్తారోన‌ని నేను ఆశ్చర్యపోతున్నాను! నా భాయ్ (త‌మ్ముడు) స్వచ్ఛమైన హృదయం కలిగి ఉన్నాడు. అతడు లక్షలాది మంది హృదయాలలో శ‌బ్ధం చేస్తున్నాడు. ఇప్ప‌టికి అయినా మేం బయటికి వచ్చి ఏదైనా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు నిజం తెలుసుకోవాల‌నుకుంటారు. భాయ్ అంటే భాయ్ .. ఎప్పటికీ మాకు గ‌ర్వ‌కార‌ణం. ప్రతి హృదయంలో అతడు కదిలించిన ప్రేమ... ఎప్పటికీ చావదు!! మేము అవిశ్రాంతంగా పోరాడుతాం. అత‌డికి న్యాయం జరగాలని.. చట్టపరమైన కేసులను దాఖలు చేసాం" అని వ్యాఖ్యానించారు.

సుశాంత్ వారసత్వాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే భావనతో అభిమాని ఒక‌రు నిరాశను వ్యక్తం చేశాడు. అభిమానుల ఆందోళనపై శ్వేత స్పందిస్తూ-మేము సీబీఐ విచార‌ణ‌కు ఒప్పించ‌డానికే చాలా కష్టపడ్డాము... ఇంకా ఏమి చేయగలం? మేము ఏవైనా నిర్దిష్ట చర్యలు ఉన్నాయా? అని సీబీఐని ప్ర‌శ్నించాం" అని తెలిపారు. ఈ కేసుపై భారతదేశంలోని అత్యుత్తమ అధికారులు ఎప్పుడూ పని చేస్తున్నారు."అని వ్యాఖ్యానించారు. 14 జూన్ 2020న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక నివేదికలు అతడు ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ధృవీకరించినప్పటికీ, ఈ కేసు డ్రగ్ కోణంతో ర‌క‌ర‌కాల‌ మలుపులు తిరిగింది. చివరికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి కేసును అప్పగించారు. ఇన్నాళ్ల‌లో అత‌డి మరణం కేసులో ఎవరూ దోషులుగా నిర్ధార‌ణ కాలేదు. సుశాంత్ ని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి చట్టపరమైన చర్యలను ఎదుర్కొన్నారు. కానీ తరువాత బెయిల్ పై విడుదలయ్యారు.