Begin typing your search above and press return to search.

స్టార్ హీరో పుత్రోత్సాహం..!

అదే దారిలో సూర్య తనయుడు కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   22 April 2024 7:34 AM GMT
స్టార్ హీరో పుత్రోత్సాహం..!
X

స్టార్ హీరోలు తమ తనయులను నెక్స్ట్ జెనరేషన్ హీరో గా నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటారు. టీనేజ్ నుంచే నటన పట్ల అవగాహన యాక్టింగ్ కోర్స్ ఇలా పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తారు. కానీ తమిళ హీరోల లెక్క మాత్రం వేరేలా ఉంటుంది. అక్కడ స్టార్ తనయులు రీల్ లైఫ్ హీరోలుగా కాదు రియల్ లైఫ్ హీరోలుగా మారాలని ప్రాత్నిస్తారు. అక్కడ స్టార్స్ తమ కొడుకులను నిజ జీవితంలో స్పూర్తిదాయకంగా ఉండేలా చేస్తుంటారు.


అందుకే వారికి చదువుతో పాటుగా ఇతర విషయాల మీద ఫోకస్ చేస్తుంటారు. కోలీవుడ్ హీరో మాధవన్ తనయుడు స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్నాడు. అదే దారిలో సూర్య తనయుడు కూడా కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్నాడు. కేవలం చదువు వల్లే కాదు మిగతా విషయాల్లో కూడా నైపుణ్యం సాధించవచ్చు అని తమ తనయుల ద్వారా అభిమానులకు మంచి సందేశం ఇస్తున్నారు.

లేటెస్ట్ గా సూర్య తనయుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఆ ఈవెంట్ కు గెస్ట్ గా సూర్య అటెండ్ అయ్యారు. బ్లాక్ బెల్ట్ సాధించిన విన్నర్ తో పాటు తనయుడిని చూసి పుత్రోత్సాహంతో మురిసిపోతున్నాడు. తనని చూసి ఎంతో గర్వంగా ఫీలయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కొడుకు పుట్టగానే హీరోనే చేయాలన్న థోరణి లేకుండా అతనికి ఏ రంగంలో ఆసక్తి ఉందో గుర్తించి ఎంకరేజ్ చేయాలి. ఆ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరోలు ఒక అడుగు ముందుంటారు. సూర్య తనయుడు హీరో అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే హీరోకి కావాల్సిన క్వాలిటీస్ ని మాత్రం సిద్ధం చేసుకున్నాడు. సూర్య తర్వాత తన లెగసీని తనయుడు కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే శివ డైరెక్షన్ లో కంగువ సినిమాతో వస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాతో సూర్య పాన్ ఇండియా లెవెల్ లో తన స్టామినా చూపించాలని చూస్తున్నారు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్పెషల్ క్రేజ్ తెచ్చేలా చేస్తుంది. సూర్య కంగువ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి.