Begin typing your search above and press return to search.

సూర్య రీ రిలీజ్.. ఇదేమి డిమాండ్ బాబోయ్

దీంతో ఈ కల్ట్ క్లాసిక్ ని అప్పట్లో తెరపై చూడలేని వారు మరల థియేటర్స్ కి వచ్చి చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు

By:  Tupaki Desk   |   4 Aug 2023 5:22 AM GMT
సూర్య రీ రిలీజ్.. ఇదేమి డిమాండ్ బాబోయ్
X

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత సినిమాలని ఫ్యాన్స్ అసోసియేషన్స్ గా ఏర్పడి రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్ప్పుడు స్టార్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలని కూడా రీరిలీజ్ చేస్తున్నారు. సూర్య హీరోగా 2008లో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇందులో తండ్రి కొడుకులుగా రెండు పాత్రలలో సూర్య కనిపించారు.

మరల 15 ఏళ్ళ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులో రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని ఎవరుచూస్తారులే అనే మాట అందరిలో వినిపిస్తోంది. కానీ ఊహించని విధంగా ఈ చిత్రాన్ని ఏకంగా 500 షోలు పడబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జారిగాయంట. రీరిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ పెద్దగా లేకపోయిన కూడా జనాల్లోకి ఈ మూవీ టాక్ వెళ్ళిపోయింది.

దీంతో ఈ కల్ట్ క్లాసిక్ ని అప్పట్లో తెరపై చూడలేని వారు మరల థియేటర్స్ కి వచ్చి చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. గౌతమ్ మీనన్ టేకింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని టీవీలో వచ్చిన కూడా ఆసక్తిగా చూసే ఆడియన్స్ ఉన్నారు. తెలుగులో ఏకంగా 500 షోలు రెండు రాష్ట్రాలలో కలిపి పడుతున్నాయంటేనే దీనికున్న ఆదరణ ఏంటి అనేది చెప్పొచ్చు.

మరి మొదటి రోజు ఈ చిత్రం థియేటర్స్ లో ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని కలెక్షన్స్ సాదిస్తుందో అనేది చూడాలి. ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నారు. దీనికి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

అతని మ్యూజిక్ టేస్ట్ తెలిసిన ప్రేక్షకులు కంగువకి గూస్ బాంబ్స్ రావడం ఖాయం అంటున్నారు. సూర్య కూడా మొదటిసారి డిఫరెంట్ రోల్ లో ఫిక్షనల్ స్టొరీతో పీరియాడికల్ జోనర్ మూవీ చేయబోతున్నాడు. టీజర్ తోనే ఇప్పటికే సినిమాపై హైప్ క్రియేట్ చేసారు. కచ్చితంగా మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.