Begin typing your search above and press return to search.

సూర్య s/o కృష్ణన్.. ఎంత వచ్చాయంటే

15 ఏళ్ళ క్రితం వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Aug 2023 4:56 AM GMT
సూర్య s/o కృష్ణన్.. ఎంత వచ్చాయంటే
X

సూర్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో 15 ఏళ్ళ క్రితం వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. లవ్ స్టోరీతో పాటు తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సమీరారెడ్డి, సిమ్రాన్, దివ్యస్పందన ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేశారు.

మరల ఇన్నేళ్ల తర్వాత తాజాగా ఈ మూవీ రీరిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు కూడా థియేటర్స్ లో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రానికి అదే స్పందన వచ్చింది. ముఖ్యంగా హరీష్ జయరాజ్ స్వరపరిచిన సాంగ్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకులు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో అయితే ఈ చిత్రానికి మంచి బుకింగ్స్ జరిగాయి. తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేసిన మౌత్ టాక్ తో ఎక్కువ బుకింగ్స్ జరిగాయి

నీరుగా సూర్య కూడా ఏపీలో ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తోన్న విజువల్స్ షేర్ చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆదరించడం ద్వారా తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ సినిమాలని ఆదరిస్తారని ప్రూవ్ అయ్యిందంటూ తమిళ్ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపించారు. వీకెండ్ మూడు రోజులు కొనసాగిన ఈ మూవీకి ఓవరాల్ గా 2.5 గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ అయినట్లు తెలుస్తోంది.

సోమవారం రోజు కూడా డీసెంట్ నెంబర్లు క్రియేట్ చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి ఈ స్థాయిలో కలెక్షన్స్ ని సాధించడం అంటే చిన్న విషయం కాదు. ఇది కేవలం సూర్య క్రేజ్, అలాగే సినిమాపై ఇప్పటికి ఉన్న ఆదరణ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. సూర్య సైతం ఈ చిత్రానికి లభించిన ఆదరణ చూసి సర్ప్రైజ్ అయ్యారని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా కంగువ చేస్తున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో రెండు భిన్నమైన పాత్రలలో సూర్యకనిపించబోతున్నాడు . అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా రానుందంట. మొదటి పార్ట్ లో ఒక ఆటవిక వీరుడిగా సూర్య కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో సూర్య లుక్ చాలా భిన్నంగా ఉండటంతో పాటు సరికొత్త ఫీల్ ఇస్తోంది. దీంతో కంగువ మూవీపై అంచనాలు పెరిగిపోతాయ