Begin typing your search above and press return to search.

కంగువ ని తక్కువ అంచనా వేస్తున్నారా..?

సూర్య కంగువ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా కూడా ఆడియన్స్ కు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయని అంటున్నారు. సూర్య కూడా తన నట విశ్వరూపం చూపిస్తాడని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 6:04 AM GMT
కంగువ ని తక్కువ అంచనా వేస్తున్నారా..?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కొంత కాలంగా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఫ్యాన్స్ మాత్రం సూర్య నుంచి ఒక కమర్షియల్ సినిమా కావాలని కోరుతున్నారు. వారి కోసమే ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో తన వీర ప్రతాపం చూపించాలని ఫిక్స్ అయ్యాడు సూర్య. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా చేస్తున్న సినిమా కంగువ. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా ఫిక్షనల్ స్టోరీగా రాబోతుంది.

ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేలా చేశాయి. ఐతే ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో కంగువ కూడా ఉంది. కానీ సినిమాపై బజ్ మాత్రం పెద్దగా లేదు. కోలీవుడ్ లో సూర్యకు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల అక్కడ కాస్త హడావిడి కనిపిస్తుంది తప్ప కంగువ సినిమాపై మిగతా చోట్ల పెద్ద హంగామా లేదు. అయితే ఇప్పటివరకు కంగువ నుంచి ఫస్ట్ గ్లింప్స్ మాత్రమే రాగా త్వరలో సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారట.

ఆ టీజర్ తోనే సినిమాపై అంచనాలను డబుల్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా సినిమాల రిలీజ్ క్లాష్ లో కంగువ ని లైట్ తీసుకుంటున్నారు కానీ కంగువ సినిమాను అంత తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సూర్య ఏరి కోరి మరి ఈ సినిమా చేస్తున్నాడు. సినిమా పోస్టర్స్ కన్ ఫ్యూజ్ చేస్తున్నా సూర్య ఈ సినిమాతో పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.

సూర్య కంగువ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే అంతా కూడా ఆడియన్స్ కు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయని అంటున్నారు. సూర్య కూడా తన నట విశ్వరూపం చూపిస్తాడని చెబుతున్నారు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తున్న కంగువ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలవనుంది. కంగువ రిలీజ్ పై క్లారిటీ రాకపోయినా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమాల్లో కంగువ కూడా ఒకటిగా ఉంటుందని చెప్పొచ్చు. కంగువ తో సూర్య మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.