తన మీద తనే కౌంటర్ వేసుకున్నాడు
తన ప్రొడక్షన్లో వచ్చిన ‘కింగ్డమ్’ గురించి.. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘వార్-2’ గురించి విడుదల ముంగిట చేసిన కామెంట్ల వల్ల ట్రోలర్స్‌కు దొరికిపోయాడు.
By: Garuda Media | 5 Sept 2025 2:00 AM ISTసినిమా వేడుకల్లో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు.. టాలీవుడ్లో చాలా ఓపెన్‌గా మాట్లాడే, బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చే నిర్మాతల్లో ముందు వరుసలో చెప్పుకోవాల్సింది సూర్యదేవర నాగవంశీ గురించే. ఈ తరహా మాటతీరు మంచి పాపులారిటీ వచ్చింది కానీ.. అదే సమయంలో అనేక వివాదాలూ తప్పలేదు. అందులోనూ ఫాంలో ఉన్నపుడు, హిట్టు సినిమా విషయంలో ఏం మాట్లాడినా చెల్లుతుంది. కానీ వరుసగా కొన్ని ఎదురు దెబ్బలు తగిలితే.. గొప్పలు పోయిన సినిమా తుస్సుమనిపిస్తే ఇబ్బందులు తప్పవు. నాగవంశీ.. ఇటీవల ఇలాగే ఇబ్బంది పడ్డాడు.
తన ప్రొడక్షన్లో వచ్చిన ‘కింగ్డమ్’ గురించి.. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘వార్-2’ గురించి విడుదల ముంగిట చేసిన కామెంట్ల వల్ల ట్రోలర్స్‌కు దొరికిపోయాడు. ఆ సినిమాలు అతను చెప్పినంత గొప్పగా లేకపోవడం.. వాటి ఫలితం గురించి అతను ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా తిరగబడడంతో కొన్ని రోజుల పాటు నాగవంశీని ఒక ఆట ఆడేసుకున్నారు నెటిజన్లు. ఈ దెబ్బతో ఎన్నడూ లేని విధంగా కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండిపోయాడీ స్టార్ ప్రొడ్యూసర్. ఐతే కింగ్డమ్, వార్-2 చిత్రాల అనుభవంతో నాగవంశీకి బాగానే జ్ఞానోదయం అయినట్లుంది. తన డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన కొత్త చిత్రం ‘కొత్త లోక’ సక్సెస్ మీట్లో అతను తన మీద తనే కౌంటర్ వేసుకున్నాడు.
ఈ సినిమా రిలీజై, బాగా ఆడుతోంది కాబట్టి కాన్ఫిడెంట్‌గా చెబుతున్నానని, వెళ్లి ధైర్యంగా సినిమ చూడొచ్చని నాగవంశీ కామెంట్ చేశాడు. కింగ్డమ్, వార్-2 చిత్రాల విషయంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్లు తన క్రెడిబిలిటీని బాాగా డ్యామేజ్ చేయడం.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడం.. ఈ నేపథ్యంలోనే నాగవంశీ ఆల్రెడీ రిలీజైన బాగా ఆడుతున్న సినిమా కాబట్టి ధైర్యంగా ఈ మాట చెబుతున్నానని నొక్కి వక్కాణించాడన్నది స్పష్టం. ఇదిలా ఉంటే.. దుల్కర్ సల్మాన్ రూ.30 కోట్ల బడ్జెట్లోనే 300 కోట్ల రూపాయల సినిమాను డెలివర్ చేసి.. భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసే తమకు చెడ్డ పేరు తెచ్చాడంటూ నాగవంశీ సరదాగా కామెంట్ చేశాడు.
