Begin typing your search above and press return to search.

సూర్య - జ్యోతిక.. ఈ వయసులో ఇది అరాచకం!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ స్టార్ కపుల్స్ గా గుర్తింపును అందుకున్న వారిలో జ్యోతిక సూర్య ఇద్దరు కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   3 April 2024 5:39 AM GMT
సూర్య - జ్యోతిక.. ఈ వయసులో ఇది అరాచకం!
X

సౌత్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ స్టార్ కపుల్స్ గా గుర్తింపును అందుకున్న వారిలో జ్యోతిక సూర్య ఇద్దరు కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీలో మంచి స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ఇక ప్రేమలో పడ్డ ఏడాది తరువాతే పెళ్లి చేసుకున్న ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలిచే విధంగా ఎంతో ప్రేమగా కనిపిస్తూ ఉంటారు.


ఇక ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా మారినా కూడా ఈ జంట ఇప్పటికీ కూడా మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా సూర్య ఐదు పదుల వయసులోకి దగ్గర పడుతున్న కూడా నేటి తరం కుర్ర హీరోలకు దీటుగా తన బాడీ బిల్డింగ్ తో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. మరోవైపు జ్యోతిక కూడా కొంతకాలం పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇంట్లోనే కుటుంబాన్ని చూసుకుంది.

ఇక మళ్ళీ ఆమె ఇప్పుడు సినిమాల్లోకి సరికొత్తగా రీ ఎంట్రీ ఇచ్చింది. డిఫరెంట్ పాత్రలు చేసుకుంటూ తనలోని యాక్టింగ్ స్కిల్స్ ని హైలెట్ చేస్తోంది. అయితే సూర్య - జ్యోతిక ఇద్దరు కూడా ఇటీవల జిమ్ లో కష్టపడిన విధానం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పాతికేళ్ల యువతి యువకులు ఎంత ఎనర్జీగా కనిపిస్తారో అంతకంటే ఎక్కువ స్థాయిలోనే ఈ ఇద్దరూ చెమటలు చిందేలా వ్యాయామం చేశారు. ఇక వారి కమిట్మెంట్ కు నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సూర్య వయసు 48 కాగా జ్యోతిక వయస్సు 45. ఈ వయసులో ఇద్దరు అరాచకంగా కనిపిస్తున్నారు అని మరికొందరు విభిన్నంగా పొగుడుతూ ఉన్నారు.

ఏదేమైనా ఈ స్టార్ జోడి బెస్ట్ కపుల్స్ అన్ని మరోసారి నిరూపించారు. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే జ్యోతిక రీసెంట్ గా బాలీవుడ్లో సైతాన్ అనే సినిమాలో కనిపించింది. అజయ్ దేవగన్ మాధవన్ నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. జ్యోతిక మరోసారి తన టాలెంట్ చూపించే మంచి గుర్తింపును అందుకుంది.

ఇక మరోవైపు సూర్య కూడా డిఫరెంట్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం కంగువా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా టీజర్ కూడా ఇటీవల పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా సమ్మర్ తర్వాత విడుదల చేయాలని చూస్తున్నారు.