Begin typing your search above and press return to search.

మృతి చెందిన అభిమాని కుటుంబానికి సూర్య ప‌రామ‌ర్శ‌

తాజాగా రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని సూర్య ప‌రామ‌ర్శించారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 10:14 AM GMT
మృతి చెందిన అభిమాని కుటుంబానికి సూర్య ప‌రామ‌ర్శ‌
X

అభిమానులంటే కోలీవుడ్ హీరోలు ప్రాణం పెడ‌తారు. అజిత్.. విజ‌య్ ..ధ‌నుష్‌..విశాల్..సూర్య‌..కార్తీ లాంటి స్టార్లు అభిమానుల‌పై అభిమానం చూపించ‌డంలో ఒక‌రికొక‌రు పోటీ ప‌డ‌తారు. విష‌యం వాళ్ల వ‌ర‌కూ చేరిందంటే త‌ప్ప‌కుండా స‌హాయం చేసే గొప్ప వ్య‌క్తిత్వం గ‌ల న‌టులు వాళ్లు. అభిమానుల క‌ష్ట సుఖాల్లోనూ ముందుటారు. కోలీవుడ్ హీరోల అభిమానం ఇంకే ప‌రిశ్ర‌మ‌లోనూ క‌నిపించ‌దు.

తాజాగా రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని సూర్య ప‌రామ‌ర్శించారు. చెన్నైలోని ఎన్నూరులో నివ‌సించే అర‌వింద్ సూర్య‌కి వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్ క్ల‌బ్ లోకొన్నేళ్ల‌గా మెంబ‌ర్ గానూ కొనసాగుతున్నాడు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో అర‌వింద్ మృతి చెందాడు. ఈ విష‌యం సూర్య‌కి తెలియ‌డంతో వెంట‌నే ఆ కుటుంబం ఇంటికెళ్లి త‌ల్లిదండ్రుల్ని ఓదార్చారు.

వాళ్ల‌తో మాట్లాడి..ధైర్యాన్ని నింపారు. ఎలాంటి అవ‌స‌రం ఉన్నా! ఏ స‌మ‌యంలోనైనా త‌న‌ని సంప్ర‌దించాల‌ని భ‌రోసా క‌ల్పించారు. అర‌వింద్ అత్మ‌కు శాంతి చేకూరాల‌ని పుష్పాంజ‌లి ఘ‌టించారు. తాజాగా సూర్య‌- ఆకుటుంబంతో క‌లిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సూర్య‌ని అలా చూసి మిగ‌తా అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారు.

మీపై మా అభిమానం..ప్రేమ మ‌రింత రెట్టింపు అయింది సార్ అంటూ అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అలాంటి కుటుంబానికి అండ‌గా నిలిచారు... మీ లాంటి స్టార్లు మాత్ర‌మే మాకు కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. గ‌తంలోనే సూర్య త‌న అభిమానులు ఎవ‌రు చ‌నిపోయినా ఆ కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మాటిచ్చారు. ఆ మాట‌కు క‌ట్టుబ‌డి మ‌రోసారి త‌న మాట‌ని నిల‌బెట్టుకున్నారు.

ఓ న‌టుడు ఇంత గొప్ప మ‌న‌సుతో ఉండ‌టం అన్న‌ది నిజంగా ప్ర‌శంసించాల్సిన విష‌యం. ఓ అభిమానిని ఎంత‌గా ప్రేమించ‌క‌పోతే ఇంటికెళ్లి ప‌రామ‌ర్శిస్తారు! ఇది సూర్య‌కి మాత్ర‌మే చెల్లింది. గ‌తంతో ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా ఇలాంటి ప‌రామ‌ర్శ‌లు చేసారు. అయితే ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు.