సూర్య కొత్త మూవీ టైటిల్ అదేనా?
ఇప్పటికే అమ్మోరు తల్లి, వీట్ల విశేషం చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న బాలాజీ.. ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నారు.
By: Tupaki Desk | 8 May 2025 5:07 PMకోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా కంగువా, రెట్రో మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. అందులో ఒకటి ఆర్జే బాలాజీతో మూవీ(సూర్య 45 ). ఇప్పటికే అమ్మోరు తల్లి, వీట్ల విశేషం చిత్రాలతో గుర్తింపు సంపాదించుకున్న బాలాజీ.. ఇప్పుడు సూర్యతో సినిమా చేస్తున్నారు.
ఫాంటసీ యాక్షన్ జోనర్ లో మూవీని ఆర్జే బాలాజీ రూపొందిస్తున్నారని కోలీవుడ్ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వైవిధ్యానికి పెద్ద పీటను ఎప్పుడూ వేసే సూర్య.. అదే కోవలో మరో సినిమా చేస్తున్నారని సమాచారం. అయితే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఆ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఆ సినిమాలో ఆర్జే బాలాజీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ సూర్య ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
అయితే సూర్య 45 ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాకు పెట్టైక్కరన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెట్టై కరుప్పు అనే టైటిల్ ను లాక్ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.
ఇక సినిమా విషయానికి వస్తే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రకాష్ రాజ్, ఎస్.ఆర్. ప్రభు గ్రాండ్ గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాత్విక, యోగి బాబు, నట్టి వంటి పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ భామ అనఘా రవి.. ఆ మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఆ విషయాన్ని వెల్లడించారు. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి సూర్య, త్రిష, అనఘా రవి వంటి నటులతో రూపొందుతున్న మూవీపై అప్పుడే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సూర్య ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా మూవీ ఉండనున్నట్లు అర్థమవుతోంది. మరి సూర్య 45 ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.