120 కేజీల నుంచి హీరోయిక్ లుక్ అంత వీజీ కాదు!
కోలీవుడ్ లో వారసుల ఎంట్రీ జోరుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 3 July 2025 12:00 AM ISTకోలీవుడ్ లో వారసుల ఎంట్రీ జోరుగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దళపతి విజయ్ తనయు డు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాసన్ చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. హీరోగా అతడి ఎంట్రీ ఉంటుందనుకుంటే? డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఫినిక్స్ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. స్టంట్ డైరెక్టర్ అనల్ అరసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సూర్య ట్రాన్సపర్మేషన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. `ఈ సినిమా ప్రారంభానికి ముందు 120 కేజీల బరువు ఉండేవాడిని. నా ఎత్తుకు తగ్గ బరువు తగ్గడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. మొదట ఆరు నెలలు చాలా కష్టపడ్డాను.
ఆహారం అలవాటైన శరీనానికి కొత్తగా డైట్ పాటించడం కష్టమైంది. పంచదార, నూనే పూర్తిగా మానేసాను. శరీరానికి బరువు అందించే అన్ని రకాల పదార్దాలకు దూరంగా ఉన్నాను. ఆ సమయంలోనే మిక్స్ డ్ మార్షల్ ఆర్స్ట్ నేర్చుకున్నాను. బాడీ షెప్ కు ఆ ట్రైనింగ్ ఎంతో ఉపయోగ పడింది. ఇక సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. నాన్న నటించిన జవాన్ సెట్ కి వెళ్లిన సమయంలోనే ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అక్కడ నన్ను అనల్ అరసు చూసి ఫినిక్స్ కథ గురించి నాన్నకు చెప్పారు. ఆయన వెంటనే సూర్యకి చెప్పమని చెప్పారు.
అతడు అంగీకరిస్తే నాకేం ఇబ్బంది లేదన్నారు. సినిమాల్లోకి రావాలా? లేదా? అన్నది పూర్తిగా అతడి ఇష్టం మీదన ఆధారపడి ఉంటుందన్నారు. అనల్ నాకు కథ చెప్ప డం.. నేను ఒకే చెప్పడం ...సినిమా తీయడం అన్ని వేగంగా జరిగిపోయాయి` అని అన్నాడు. మరి తండ్రి వారసత్వాన్ని సూర్య ఏ మేర సక్సస్ చేస్తాడో చూడాలి.
