సూర్య 'రెట్రో'.. ప్రభాస్ మూవీ వల్ల పూజకు ఛాన్స్!
రాధేశ్యామ్ లో తన రోల్ కు పండించిన ఎమోషన్స్ చూసి రెట్రో సినిమాకు తాను సరిగ్గా సరిపోతానని కార్తీక్ సుబ్బరాజ్ భావించారని పూజ తెలిపింది.
By: Tupaki Desk | 24 April 2025 4:00 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ పూజా హెగ్డే కాంబోలో రూపొందిన రెట్రో మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుంది. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
అదే సమయంలో పూజ కూడా ఫుల్ యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కీలక విషయాలు షేర్ చేసుకుంటోంది. రీసెంట్ గా రెట్రో మూవీకి గాను ఫస్ట్ టైమ్ మాట్లాడేందుకు రమ్మనప్పుడు మేకప్ లేకుండా కార్తీక్ సుబ్బరాజు రమ్మన్నారని చెప్పిన విషయం తెలిసిందే. అప్పుడెంతో హ్యాపీగా ఫీలయ్యానని చెప్పింది.
ఇప్పుడు పూజ షేర్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాలో పూజ ఫిమేల్ లీడ్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఆ మూవీలోని తన యాక్టింగ్.. కార్తీక్ సుబ్బరాజ్ కు నచ్చిందని.. ఆ విషయం తెలిసి తాను షాక్ అయ్యానని పూజ తెలిపింది.
రాధేశ్యామ్ లో తన రోల్ కు పండించిన ఎమోషన్స్ చూసి రెట్రో సినిమాకు తాను సరిగ్గా సరిపోతానని కార్తీక్ సుబ్బరాజ్ భావించారని పూజ తెలిపింది. అయితే రాధేశ్యామ్ మూవీ.. అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. కానీ ఆమె యాక్టింగ్.. ఇతర మేకర్స్ పై ముద్ర వేసిందనే చెప్పాలి.
అదే సమయంలో రెట్రో మూవీ పెద్ద ఎగ్జామ్ లాంటిదని తెలిపింది పూజ. యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్.. అన్నీ కలయికతో ప్రేక్షకులకు భిన్నమైన ఎక్స్పీరియన్స్ ను రెట్రో అందిస్తుందని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం.. పూజ మేకప్ లేకుండా సింపుల్ లుక్ లో సినిమాలో కనిపించనుంది.
ఇక రెట్రో మూవీలో తాను చేసిన రోల్.. కెరీర్ లో కొత్త స్టేజ్ ను సూచిస్తుందని పూజా హెగ్డే తెలిపింది. ముఖ్యంగా పీరియాడికల్ మూవీలో పవర్ ఫుల్ రోల్స్ చేయాలని ఉందని తనలోని కోరిక బయటపెట్టింది అమ్మడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం తన లక్ష్యమంటూ పూజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
