కూతురితో రానా నాయుడు నటి అలా.. అంతా ఒక్కసారిగా షాక్!
రానా నాయుడు వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jun 2025 6:00 PM ISTరానా నాయుడు వెబ్ సిరీస్ తో టాలీవుడ్ లో బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సిరీస్ సీక్వెల్ కూడా త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మదర్ హుడ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు!
సుర్వీన్ చావ్లా కుమార్తె వయసు మూడేళ్లట. ఆమె ఇంట్లో ఉండే శానిటరీ ప్యాడ్స్ సహా ఇతర పరిశుభ్రత వస్తువులను తరచూ చూస్తుంటుందని ఆమె చెప్పారు. అది కూడా ఉత్సుకతతో చూస్తుందని తెలిపారు. అందుకే ఆ వస్తువులతోపాటు వాటి యాసెజ్ ను కుమార్తెకు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు సుర్వీన్ చెప్పడం గమనార్హం.
"నా కుమార్తె తన బాడీ కోసం అన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులో ఏదీ దాచాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. యో*ని, రుతుస్రావం వంటి పదాలను ఉపయోగిస్తుంటా. కానీ ఆమెది చిన్న వయసు. అందుకే ప్రతీ అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది. అందుకే సింపుల్ లాంగ్వేజ్ లో వివరిస్తా" అని సుర్లీన్ చావ్లా తెలిపారు.
అయితే తన కుమార్తె పెరిగే కొద్ది.. సామాజిక ఆంక్షలు అనుభవించకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు సుర్వీన్. డాటర్ తో తనవి ఎప్పుడూ కన్వర్జేషన్స్ ఓపెన్ ఉంటాయని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుర్వీన్ విధానాన్ని కొందరు ప్రశంసిస్తున్నారు. మరికొందరు అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఆమె నిజాయితీని అభినందిస్తున్నారు.
ఇక సుర్వీన్ చావ్లా కెరీర్ విషయానికొస్తే.. కహీం తో హోగా టీవీ సీరియల్ తో 2003లో యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చారు అమ్మడు. ఆ తర్వాత ఏడాదే కసౌటీ జిందగీ కిలో చారు రోల్ లో మెప్పించారు. క్ ఖిలాడీ ఏక్ హసీనా రియాలిటీ డ్యాన్స్ షోలో పాల్గొని ఓ రేంజ్ లో సందడి చేశారు. ఆ తర్వాత పంజాబీ మూవీ ధర్తితో హీరోయిన్ గా మారారు.
హిందీలో హేట్ స్టోరీ 2, అగ్లీ, పర్చ్ డ్, 24 వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేశారు సుర్వీన్. సేక్రెడ్ గేమ్స్ వెబ్ సిరీస్ తో మెప్పించిన ఆమె.. రానా నాయుడు సిరీస్ తో ఓ రేంజ్ లో అలరించారు. ఇప్పుడు రానా నాయుడు సీక్వెల్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సందర్భంలోనే మదర్ హుడ్ గురించి మాట్లాడారు సుర్వీన్.
