Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడి పనైపోలేదు.. ఇదే సాక్ష్యం

దర్శకుడిగా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సురేందర్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన సినిమాలు పది. పది సినిమాల్లో సక్సెస్ రేటు చాలా తక్కువే.

By:  Tupaki Desk   |   30 Oct 2023 6:50 AM GMT
ఆ దర్శకుడి పనైపోలేదు.. ఇదే సాక్ష్యం
X

దర్శకుడిగా రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సురేందర్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన సినిమాలు పది. పది సినిమాల్లో సక్సెస్ రేటు చాలా తక్కువే. అయితే సక్సెస్ అయిన సినిమాలు సురేందర్ రెడ్డికి స్టార్‌ డమ్‌ ను తెచ్చి పెట్టాయి. రామ్‌ చరణ్ తో రూపొందించిన ధృవ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ఇప్పటి వరకు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేక పోయాడు.

సైరా సినిమా తో చిరంజీవి కి భారీ విజయాన్ని ఇస్తాడనుకుంటే నిరాశ పరిచాడు. ఆ సినిమా నుంచి తేరుకుని అఖిల్ తో రూపొందించిన ఏజెంట్ సినిమా సురేందర్ రెడ్డిని మరింత కింది స్థాయికి దిగజార్చింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిల్‌ మార్కెట్‌ ను గురించి పట్టించుకోకుండా ఏజెంట్‌ సినిమాను భారీగా ఖర్చు చేసిన సురేందర్‌ రెడ్డిని అంతా విమర్శించారు.

ఏజెంట్ ఫలితం తో సురేందర్ రెడ్డి తో సినిమా అంటే నిర్మాతలు మరియు హీరోలు భయపడుతారని అంతా అనుకున్నారు. ఆ దర్శకుడి పనైపోయింది అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. కానీ అనూహ్యంగా సురేందర్ రెడ్డి ఇద్దరు స్టార్‌ హీరోలతో సినిమాలను లైన్ లో పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు.

సురేందర్ రెడ్డి కొన్ని వారాల క్రితం వెంకటేష్ హీరోగా ఒక సినిమా ను రూపొందించేందుకు కథ చెప్పి ఓకే చెప్పించుకున్నాడు. ఇటీవల తమిళ స్టార్‌ నటుడు విక్రమ్‌ తో ఒక సినిమాకు ఓకే చెప్పించాడు. పాన్ ఇండియా రేంజ్‌ లో విక్రమ్‌ తో సినిమా ను చేయబోతున్నట్లుగా సురేందర్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.

వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత విక్రమ్‌ తో సూరి మూవీ ఉంటుందని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ రెండు సినిమాల గురించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో సూరి సక్సెస్ దక్కించుకుంటే కచ్చితంగా టాలీవుడ్ లో మళ్లీ మోస్ట్‌ బిజీ డైరెక్టర్ గా సూరి నిలిచే అవకాశాలు ఉన్నాయి.