Begin typing your search above and press return to search.

సైలెంటుగా పిండుకుంటున్న సూర్య

ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన సూర్య సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వీకెండ్లో ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే.

By:  Garuda Media   |   30 Aug 2026 10:00 PM IST
సైలెంటుగా పిండుకుంటున్న సూర్య
X

ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన సూర్య సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తొలి వీకెండ్లో ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. తమిళంలో వీకెండ్ వరకు ఓకే అనిపించినా.. ఆ తర్వాత అక్కడా సినిమా పెద్దగా షేర్ రాబట్టలేకపోయింది. కానీ తెలుగులో మాత్రం వీక్ డేస్‌లోనూ జోరు కొనసాగించింది. కానీ సెకండ్ వీకెండ్లో సూర్య సినిమాకు ‘ఇరుముడి’ రూపంలో పెద్ద అడ్డంకి ఎదురైంది. ఆ సినిమా చాలా మంచి టాక్ తెచ్చుకుని.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకెళ్లింది.

‘ఇరుముడి’కి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు స్క్రీన్లు తగ్గించక తప్పలేదు. కానీ ఉన్న స్క్రీన్లలో ఆ సినిమా సెకండ్ వీకెండ్లోనూ మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. ఐతే ఈ వారం మధ్యలో ‘టాక్సిక్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల కావడం.,. మరోవైపు ‘ఇరుముడి’ డిమాండ్ తగ్గకపోవడంతో సూర్య సినిమా పనైపోయినట్లే అనుకున్నారంతా. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ నుంచి ఏమీ అంతర్ధానం అయిపోలేదు.

‘టాక్సిక్’ డిజాస్టర్ టాక్ వచ్చి.. రెండో రోజుకే స్లో అయిపోవడంతో ఆ సినిమా స్క్రీన్లు, షోలను తీసి మళ్లీ చాలా వరకు ‘ఇరుముడి’కి.. కొంత మేర ‘విశ్వనాథన్ అండ్ సన్స్’కు పంచారు. అందుబాటులో ఉన్న స్క్రీన్లలో మూడో వీకెండ్లోనూ ఈ చిత్రం బాగా ఆడుతోంది. నిన్న సాయంత్రం తర్వాత హైదరాబాద్ సిటీలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు వందకు పైగా షోలు కేటాయించగా.. అవన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఈ రోజు కూడా కేటాయించిన షోలకు రెస్పాన్స్ బాగుంది.

‘ఇరుముడి’ తర్వాత ప్రేక్షకుల ఛాయిస్ ఇదే. ‘ఇరుముడి’ ఓవర్ ఫ్లోస్ కూడా దీనికి కలిసి వస్తున్నాయి. దీంతో మూడో వీకెండ్లో కూడా స్ట్రాంగ్ హోల్డ్‌‌తో ఈ సినిమా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఫుల్ రన్లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయనున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ‘కరుప్పు’తో రూ.300 కోట్ల మార్కును అందుకున్న సూర్యకు.. వెంటనే రూ.200 కోట్ల సినిమా పడడం విశేషమే.