Begin typing your search above and press return to search.

సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. సరైన డేట్ ఫిక్స్ చేశారుగా..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

By:  M Prashanth   |   28 May 2026 1:23 PM IST
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్.. సరైన డేట్ ఫిక్స్ చేశారుగా..
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్ట్ చేస్తున్న తొలి స్ట్రెయిట్ తెలుగు మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఆ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా రిలీజ్ డేట్‌ ను మేకర్స్ తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాను 2026 ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్‌ ను టార్గెట్ చేస్తూ డేట్ లాక్ చేయడంతో.. ఇది సినిమాకు ప్లస్ అవుతుందనే అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.





ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సూర్యను క్లాస్ అండ్ ఎమోషనల్ రోల్‌ లో చూపించిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న సినిమా కావడంతో సినిమాపై ముందు నుంచే హైప్ క్రియేట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్‌ షిప్స్‌ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేస్తూ వెంకీ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

అదే సమయంలో సూర్యకు కూడా సినిమా చాలా కీలకంగా మారింది. ఇటీవల వచ్చిన కరుప్పు కమర్షియల్‌ గా మంచి వసూళ్లు సాధించినా.. పూర్తి స్థాయి బ్లాక్‌ బస్టర్ టాక్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో తెలుగులో సాలిడ్ హిట్ అందుకోవాలని సూర్య భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేలా కథ, పాత్రలను సినిమాను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలో యంగ్ సెన్సేషన్ మమితా బైజు హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ యాక్ట్రెస్ లు రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కుటుంబ కథా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో వారి రోల్స్ కు మంచి స్కోప్ ఉంటుందని తెలుస్తోంది. మ్యూజిక్ ను జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఆయన వర్క్ పై కూడా అంచనాలు పెరిగాయి.

ఎమోషనల్ సీన్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ కు సరిపోయేలా అవుట్ పుట్ ను ఆయన అందిస్తున్నారని సమాచారం. అయితే సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. విజువల్స్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారని వినికిడి.

ఏదేమైనా సరైన రిలీజ్ డేట్‌ తో పాటు సూర్య- వెంకీ అట్లూరి కాంబినేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టార్ క్యాస్టింగ్.. ఇవన్నీ కలిసి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీపై మంచి బజ్ తీసుకొచ్చాయి. అయితే కంటెంట్ తో పాటు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కూడా కలిసి వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో.. సినిమా ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.