Begin typing your search above and press return to search.

విజయ్ క్రేజ్.. ఆ లెక్కలో సూర్యకు మరో టెస్ట్

విజయ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్‌లోకి వెళ్లిన తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆయన వదిలిన టాప్ స్టార్ స్పేస్ ఖాళీ అయింది. ఆ ప్లేస్‌ను ఎవరు హోల్డ్ చేస్తారనే పాయింట్ వచ్చినప్పుడు చాలామంది సూర్య వైపు కూడా చూశారు.

By:  M Prashanth   |   15 Aug 2026 12:00 AM IST
విజయ్ క్రేజ్.. ఆ లెక్కలో సూర్యకు మరో టెస్ట్
X

విజయ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్‌లోకి వెళ్లిన తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆయన వదిలిన టాప్ స్టార్ స్పేస్ ఖాళీ అయింది. ఆ ప్లేస్‌ను ఎవరు హోల్డ్ చేస్తారనే పాయింట్ వచ్చినప్పుడు చాలామంది సూర్య వైపు కూడా చూశారు. విజయ్ ఇమేజ్‌ను సూర్య రీప్లేస్ చేశాడని ఎవరూ అనట్లేదు కానీ, ఆ రేంజ్ నంబర్లు లాగగలిగే సత్తా ఆయనకు ఉందనే అభిప్రాయం ట్రేడ్‌లో ఉంది.

సూర్య గత సినిమా 'కరుప్పు' ఆ నమ్మకాన్ని కొంచెం పెంచింది. పక్కా మాస్ కంటెంట్‌తో వచ్చిన ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. సరైన కమర్షియల్ మాస్ సినిమా పడితే థియేటర్లలో సూర్య క్రౌడ్ పుల్లింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఆ ప్రాజెక్ట్‌తో మరోసారి ప్రూవ్ అయింది.

అయితే ఇప్పుడు సూర్య ముందు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రూపంలో మరో టాస్క్ ఉంది. వెంకీ అట్లూరి తీసిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఎర్లీ రెస్పాన్స్ చూస్తే ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది. కానీ సినిమా హిట్ అని ఇప్పుడే ఒక క్లారిటీకి రాలేము. మొదటి రోజు కలెక్షన్లతో పాటు లాంగ్ రన్ హోల్డ్ చూడాల్సి ఉంటుంది.

ఇది కరుప్పు లాంటి లౌడ్ మాస్ సినిమా కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాన్స్, క్లాసీ కమర్షియల్ ట్రీట్‌మెంట్‌తో నడిచే డ్రామా. భారీ ఎలివేషన్లు లేకపోయినా కేవలం తన స్టార్ ఇమేజ్‌తో ఇలాంటి ఫ్యామిలీ కథను సూర్య బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద నంబర్ల వైపు తీసుకెళ్తాడనేది చూడాలి. గతంలో విజయ్ చేసిన 'వారిసు' సినిమా ఇలాంటిదే. ఆ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా విజయ్ ఫ్యామిలీ ఇమేజ్ వల్లే భారీ కలెక్షన్లు వచ్చాయి.

రెండు సినిమాల కథలు ఒకటి కాకపోయినా, ఒక స్టార్ హీరో ఫ్యామిలీ జోనర్ డ్రామాతో కూడా మాస్ రేంజ్ వసూళ్లు తేవడమనేది ఆయన బాక్సాఫీస్ స్టామినాను చూపిస్తుంది. మాస్ ఫార్ములా లేకపోయినా ఇలాంటి క్లాస్ ఫ్యామిలీ కథతో కూడా సూర్య పెద్ద కలెక్షన్లు లాగితే ఆయన మార్కెట్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. విజయ్ వదిలిన టాప్ బాక్సాఫీస్ స్పేస్‌లో సూర్య ఎంతవరకు ఫిట్ అవుతాడనే డిస్కషన్‌కు ఈ సినిమా రిజల్ట్ ఒక క్లారిటీ ఇస్తుంది. ఇక ఈ వీకెండ్ తర్వాత వచ్చే వసూళ్ల లెక్కలే అసలు విషయం చెబుతాయి.