సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సవాల్!
అయితే ఈ సినిమా వెనుక ఓ పెద్ద సవాల్ కూడా ఉంది. వెంకీ అట్లూరి గత చిత్రాలైన `సార్` బాక్సాఫీస్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే తమిళం కంటే తెలుగులోనే అత్యధిక వసూళ్లను సాధించి పెద్ద విజయాలుగా నిలిచాయి.
By: Sivaji Kontham | 31 May 2026 8:00 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య కు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఆయన నటించిన `కరుపు` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విజయం సూర్య కెరీర్‌కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. దీంతో సూర్య తదుపరి చిత్రాలపై అంచనాలను ఆకాశాన్నం టుతున్నాయి. ఈ జోష్‌లోనే సూర్య - వెంకీ అట్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ `విశ్వనాథ్ అండ్ సన్స్`. ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. స్వచ్ఛమైన హ్యూమన్ ఎమోషన్స్, సామాజికాంశాల నేపథ్యంలో సాగే కథతో సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సూర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తు న్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి సక్సెస్ ట్రాక్ తోనే ఇలాంటి హైప్ క్రియేట్ అవుతుంది. క్లాస్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ విలువలను జోడించి హృదయానికి హత్తుకునేలా సినిమాలు తీయడంలో వెంకీ సిద్ధహస్తుడు. గతంలో ఆయన తెరకెక్కచించిన `సార్` (తమిళంలో వాతి) కంటెంట్ పరంగా ప్రశంసలందుకుంది. సమాజంలోని సున్నితమైన అంశాలను ఎమోషనల్ డ్రామాగా మార్చడంలో వెంకీ ప్రతిభ సూర్య లాంటి పవర్‌ఫుల్ పర్ఫార్మర్‌కు సరిగ్గా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ సినిమా వెనుక ఓ పెద్ద సవాల్ కూడా ఉంది. వెంకీ అట్లూరి గత చిత్రాలైన `సార్` బాక్సాఫీస్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే తమిళం కంటే తెలుగులోనే అత్యధిక వసూళ్లను సాధించి పెద్ద విజయాలుగా నిలిచాయి. వెంకీ మేకింగ్ స్టైల్ .. కథా గమనం తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ అయినంతగా కోలీవుడ్ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక తమిళ స్టార్ హీరో చిత్రానికి ఇరు భాషల్లో సమన్యాయం చేయడం దర్శకుడికి పెద్ద పరీక్షే. సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నా? ఆయన ప్రాథమికంగా కోలీవుడ్ అగ్ర హీరో. కాబట్టి `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంతో తన సొంత తమిళ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించాల్సిన బాధ్యత ఉంది.
అదే సమయంలో తనపై ఎంతో నమ్మకం ఉంచిన తెలుగు ప్రేక్షకులను కూడా నిరాశపరచకూడదు. ఈ రెండు భిన్నమైన నేటివిటీలను, ప్రేక్షకుల అభిరుచులను బ్యాలెన్స్ చేస్తూ సినిమాను ముందుకు తీసుకెళ్లడం సూర్యకు .. చిత్ర బృందానికి సవాల్ అనే చెప్పాలి. `కరుపు` ఇచ్చిన సక్సెస్ ట్రాక్‌ను సూర్య ఈ చిత్రంతో ఎలా కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
