కరుప్పు మూవీ.. సూర్య 'ప్రామిస్' ఏంటంటే?
సెకండ్ హాఫ్ మాత్రం థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. మాస్ మూమెంట్స్, యాక్షన్, హ్యూమర్, ఫన్ అన్ని కలిసివస్తాయని తెలిపారు.
By: M Prashanth | 12 May 2026 9:16 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కరుప్పు.. తెలుగు ప్రేక్షకుల ముందుకు 'వీరభద్రుడు'గా రాబోతున్న విషయం తెలిసిందే. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో సీనియర్ బ్యూటీ త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సహా అన్ని ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకున్న ఆ సినిమా మే 14వ తేదీన థియేటర్స్ లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా విషయంలో ఆయన చేసిన ప్రామిస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. వీరభద్రుడు మూవీ కంప్లీట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సినిమా తొలి భాగం ఎమోషనల్ కోర్టు రూమ్ డ్రామాగా సాగుతుందని తెలిపారు.
సెకండ్ హాఫ్ మాత్రం థియేటర్లలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. మాస్ మూమెంట్స్, యాక్షన్, హ్యూమర్, ఫన్ అన్ని కలిసివస్తాయని తెలిపారు. మే 14వ తేదీన ఆడియన్స్, అభిమానులకు మంచి ఎంటర్టైనింగ్ సినిమా ఇవ్వబోతున్నామని ప్రామిస్ చేస్తున్నామంటూ సూర్య చేసిన కామెంట్స్.. ఒక్కసారిగా సినిమాపై అందరిలో అంచనాలను పెంచేశాయని చెప్పాలి.
దర్శకుడు ఆర్‌జే బాలాజీపై కూడా సూర్య ప్రశంసలు కురిపించారు. ఆయన జర్నీ ఎంతో ఇన్స్పిరేషన్ అని, కథను ఎంత నిజాయితీగా రాశారో అంతే రీతిలో సినిమా తెరకెక్కించారని అన్నారు. ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ ను యాడ్ చేసిన ఆయన, ప్రేక్షకులు ఎంజాయ్ చేసే మాస్ మసాలా మూమెంట్స్ తీసుకొచ్చారని చెప్పారు. ఈ మధ్యకాలంలో వచ్చిన తన సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందని సూర్య వెల్లడించారు.
ఇటీవల సూర్య నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో కరుప్పుపై అభిమానులు ప్రత్యేక ఆశలు పెట్టుకున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కోర్టు రూమ్ సన్నివేశాలు, మాస్ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్లు సినిమాపై హైప్ పెంచుతున్నాయి.
సినిమాలో త్రిష పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని సూర్య తెలిపారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి నటించడం విశేషమని తెలిపారు. "త్రిష అద్భుతంగా నటించింది. మా ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది" అని చెప్పారు. అలాగే ఫైట్ మాస్టర్ విక్రమ్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ అవుతాయని తెలిపారు.
అయితే తెలుగులో కరుప్పు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కార్తీ, సుప్రియ యార్లగడ్డ, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు. మొత్తంగా చూస్తే.. కరుప్పుతో సూర్య మరోసారి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. కోర్ట్ రూమ్ డ్రామా, మాస్ యాక్షన్, హ్యూమర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో.. ఎలాంటి హిట్ అవుతుందో అంతా వేచి చూడాలి.
