టాలీవుడ్లో సూర్య సెకెండ్ మూవీ ఫిక్సైందా?
కోలీవుడ్ స్టార్ సూర్య టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంతో లాంచ్ అవుతున్నాడు.
By: Srikanth Kontham | 27 Sept 2025 7:00 PM ISTకోలీవుడ్ స్టార్ సూర్య టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంతో లాంచ్ అవుతున్నాడు. సూర్య ఇమేజ్ కి వెంకీ మార్క్ ట్యాలెంట్ ని మిక్స్ చేసి తీస్తోన్న చిత్రమిది. ఈ చిత్రాన్ని నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎంతో మంది నిర్మాతలున్నా? సూర్య ఆ అవకాశం నాగవంశీకి ఇవ్వడంతో? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. వెంకీ కథలంటే పెద్దగా బడ్జెట్ తో కూడినవిగా ఉండవు. కథా బలంతోనే సహజ లొకేషన్లలలోనే వీలైనంత వరకూ షూటింగ్ ముగిస్తాడు.
రెండవ చిత్రం భారీగా:
పాటల కోసం విదేశాలకు వెళ్లి అద్బుతాలు చేసేయాలి? అన్న ఆలోచన అతడికి ఉండదు. తక్కువ బడ్జెట్ లో ఉత్తమ చిత్రం అందించాలి? అన్నది అతడి కాన్సెప్ట్. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకూ అలాగే పనిచేసుకుంటూ వచ్చాడు. అందుకే ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ దర్శకుడిగా పేరుగాంచాడు. సూర్య కూడా టాలీవు డ్ లో ఎంతో మంది దర్శకులున్నా? వెంకీకే తనని లాంచ్ చేసే అవకాశం ఇచ్చారు. తాజాగా సూర్య సెకెండ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. వెంకీ సినిమా పూర్తయిన వెంటనే సూర్య తన రెండవ సినిమా కూడా వెంటనే మొదలు పెట్టాలని భావిస్తున్నాడట.
పాన్ ఇండియా కాన్సెప్ట్ తోనా:
ఇప్పటికే ఓ అగ్ర నిర్మాణ సంస్థలో ఆ రెండవ ప్రాజెక్ట్ లాక్ అయిందని సమాచారం. ఇది మాత్రం భారీ బడ్జెట్ తో కూడిన పాన్ ఇండియా సినిమాగా తెరపైకి వస్తోంది. సూర్యకి ఆ నిర్మాత ఎంతో కాలంగా తెలుసు. కనిపించినప్పుడు ఇద్దరు మంచి స్నేహితులుగానూ మెలుగుతారు. ఆ కారణంగానే సూర్య రెండవ సినిమాకు ఆ బడా నిర్మాత రం గంలోకి దిగుతున్నారట. అయితే డైరెక్టర్ స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. ఓ పాన్ ఇండియా ఆ కాన్సెప్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది.
సూర్యతో పెద్ద ప్లానింగే:
వాస్తవానికి సూర్యతో సినిమా చేయాలని ఆ నిర్మాత చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సూర్యని తెలుగు లో తానే లాంచ్ చేయాలనుకున్నారు. కానీ వెంకీ అట్లూరి కమిట్ మెంట్ మరో నిర్మాతతో ఉండటంతో? అటువైపు ప్రాజెక్ట్ టర్నింగ్ తీసుకుంది. పైగా ఈ కాన్సెప్ట్ సింపుల్ సబ్జెక్ట్ కావడంతో ఆ బడా నిర్మాత కూడా లైట్ తీసుకున్నారు. సూర్యతో తీస్తే ఓ భారీ బడ్జెట్ చిత్రమే చేయాలి అన్నది అతడి ప్లాన్.
