Begin typing your search above and press return to search.

అరుదైన హ్యాట్రిక్‌ రికార్డ్‌కి చేరువలో సూర్య

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం ఏడాదికి ఒక్క సినిమాతో వస్తున్నారు.

By:  Ramesh Palla   |   25 Oct 2026 2:00 PM IST
అరుదైన హ్యాట్రిక్‌ రికార్డ్‌కి చేరువలో సూర్య
X

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం ఏడాదికి ఒక్క సినిమాతో వస్తున్నారు. కొందరు హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చొప్పున చేస్తున్నారు. ఇక కొందరు భారీ బడ్జెట్‌ సినిమా అని రెండు మూడు ఏళ్లు కూడా తీసుకుంటున్నారు. చాలా అరుదుగా మాత్రమే స్టార్‌ హీరోల నుంచి ఏడాదికి రెండు సినిమాలు వస్తున్నాయి. అలాంటిది ఒక స్టార్ హీరో నుంచి ఒకే ఏడాదిలో ఏకంగా మూడు సినిమాలు రావడం అనేది కచ్చితంగా రికార్డ్‌గా చెప్పుకోవాలి. ఈమధ్య కాలంలో ఏడాదిలో మూడు సినిమాలు విడుదల చేసిన హీరో అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. గతంలో ఏడాదిలో పది సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు హీరోలు ఒక్క సినిమాకే బాబోయ్‌ అంటున్నారు. రెండు సినిమాలతో ఒక హీరో ఒకే ఏడాదిలో వస్తే అద్భుతం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తమిళ్ స్టార్‌ హీరో సూర్య ఈ ఏడాది ఇప్పటివరకు రెండు సినిమాలతో వచ్చి, మరికొన్ని రోజుల్లో తన మూడో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇది ఈ దశాబ్దపు రికార్డ్‌గా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

కరుప్పు సినిమాతో సూపర్‌ హిట్‌....

ఈ ఏడాది ఆరంభంలో 'కరుప్పు' అనే విభిన్నమైన సినిమాతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాడుతో పాటు, తెలుగు ప్రేక్షకులు సైతం కరుప్పు సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ ఇచ్చారు. తమిళనాట భారీ వసూళ్లు చేసి ఈ ఏడాది మేటి చిత్రాల జాబితాలో నిలిచిన విషయం తెల్సిందే. కరుప్పు విజయంతో జోష్ మీదున్న సూర్య తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి చేసిన విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, తమిళనాట భారీ వసూళ్లు సాధించి, సూర్య కెరీర్‌ లో స్పెషల్‌ మూవీగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో హిట్స్ సాధించిన సూర్య మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

విశ్వనాథ్ అండ్‌ సన్స్‌ మూవీతో సూర్య...

ఒక ఏడాదిలో స్టార్‌ హీరో నుంచి రెండు సినిమాలు రావడం, ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అందుకే సూర్య ఇప్పటికే అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో స్పెషల్‌ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు గాను సూర్య రెడీ అవుతున్నాడని ఫ్యాన్స్‌ నమ్మకంతో ఉన్నారు. నవంబర్‌ 6న సూర్య నటించిన 'సీన్‌' మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి కానుకగా విడుదల కాబోతున్న సీన్‌ పై సూర్య ఫ్యాన్స్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్‌ అయితే ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో హిట్‌ కొట్టిన ఈతరం హీరోగా అరుదైన రికార్డ్‌ను సూర్య దక్కించుకున్నవాడు అవుతాడు అని వారు ఎదురు చూస్తున్నారు. మరి సూర్య ఆ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సీన్‌ తో ఆ సూపర్‌ హిట్‌ ను దక్కించుకునేనా అనేది నవంబర్‌ 6 వరకు వెయిట్‌ చేసి చూడాల్సిందే.

సూర్య కొత్త సినిమా సీన్‌ దీపావళికి విడుదల...

సీన్‌ మూవీలో సూర్యను చాలా కొత్తగా చూస్తారని మేకర్స్ అంటున్నారు. ఇది యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జోనర్‌లో సాగుతుందట. యూత్‌ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే అంశాలు సినిమాలో చాలా ఉంటాయని అంటున్నారు. జితు మాధవన్ దర్శకత్వం దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో జాన్‌ విజయ్‌, ఆనందరాజ్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా స్టోరీ లైన్‌ విషయానికి వస్తే.. 900 మంది నేరస్థులను అరెస్టు చేసిన రికార్డు ఉన్న పోలీస్ అధికారి ఒకానొక కేసు విషయంలో పడ్డ ఇబ్బందులు ఏంటీ అనే పాయింట్‌తో కథ సాగుతుందట. స్క్రీన్‌ ప్లే బలంగా ఉండటం వల్ల తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆధరిస్తారనే నమ్మకంను దర్శకుడు జితు మాధవన్‌ వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేయడంకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ ఈ సినిమా డబ్బింగ్‌ రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో హిట్‌ కొట్టి అరుదైన హ్యాట్రిక్‌ రికార్డ్‌ను సూర్య దక్కించుకునేనా అనేది చూడాలి.