స్టైల్‌గా వచ్చిన సింగం.. స్టన్నయిపోయిన పెళ్లికూతురు
సింహం సింగిల్‌గా వచ్చినా దాని స్టైలే వేరు. కోలీవుడ్ సింగం సూర్య స్టైలిష్ ఎంట్రీ చూసిన కొత్త పెళ్లికూతురు స్టన్నయిపోయింది.
By: Sivaji Kontham | 31 Dec 2025 4:03 PM ISTసింహం సింగిల్‌గా వచ్చినా దాని స్టైలే వేరు. కోలీవుడ్ సింగం సూర్య స్టైలిష్ ఎంట్రీ చూసిన కొత్త పెళ్లికూతురు స్టన్నయిపోయింది. పెళ్లిలో అవాక్కయి నోరెళ్లబెట్టి స్టార్ హీరో సూర్యను చూస్తూ ఉండిపోయింది ఆ పెళ్లికూతురు. సూర్య ఎంతో సింపుల్ గా ఎలాంటి హంగామా లేకుండా పెళ్లికి అటెండవ్వడమే గాక, అక్కడ అందరికీ నమస్కరిస్తూ తన వినమ్రతను చాటుకున్నాడు. ఆ సమయంలో సూర్య వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించాడు.
కొత్త జంట అరవింద్ - కాజల్ వివాహంలో ఆ క్షణం ఎంతో ఎగ్జయిట్ చేసిన క్షణం. ప్రస్తుతం పెళ్లి వేడుక నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సూర్య నేరుగా వివాహ మందిరంలోకి అడుగుపెడుతున్నప్పుడు పెళ్లికూతురు రియాక్షన్ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి కూతురు కాజల్ తన కళ్లను తానే నమ్మలేకపోయింది. వేదిక వద్ద ఉన్న అతిథులు కూడా అంతే ఆశ్చర్యపోయారు. సూర్యను చూడగానే పెళ్లి మంటపంలో ఒకటే గుసగుసలు మొదలైపోయాయి. అందరిలో ఉత్సాహం కనిపించింది.
వరుడు అరవింద్ అతిథిగా వచ్చిన సూర్యను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ కనిపించాడు. నూతన వధూవరులను విష్ చేసిన సూర్య వారితో ముచ్చట్లాడుతూ కనిపించాడు. ఫోటోలకు పోజులు ఇచ్చాడు. కొత్త జంటకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను అందించారు సూర్య.
కొత్త సంవత్సరంలో దూకుడు:
సౌత్ అగ్ర హీరోలలో ఒకరిగా ఉన్న సూర్య కెరీర్ ఇటీవల డల్ ఫేజ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ తర్వాత సరైన హిట్టు లేదు.. వరుసగా సర్ఫిరా, కంగువ, రెట్రో .. ఏవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు..మార్కెట్ పరంగా పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉన్నాడు సూర్య. ముఖ్యంగా కంగువ లాంటి భారీ యాక్షన్ చిత్రం ఫెయిలవ్వడం సూర్యను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే సూర్య కెరీర్ తిరిగి పుంజుకోవాలంటే, 2026లో అతడు కంటెంట్ తో దూసుకు రావాల్సి ఉంది.
కొత్త సంవత్సరంలో సూర్య నటించిన `కరుప్పు` రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాపైనే సూర్య ఆశలు..కరుప్పు (నలుపు) భారీ యాక్షన్ డ్రామా చిత్రం. దీనికి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించారు. అశ్విన్ రవిచంద్రన్, రాహుల్ రాజ్, టి. ఎస్. గోపి కృష్ణన్, కరణ్ అరవింద్ కుమార్‌లతో కలిసి ఆర్జే బాలాజీ కథను రాశారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్య -త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల కోసం సూర్య ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. భారీ యాక్షన్ చిత్రంలో రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో సూర్య నటవిశ్వరూపం ప్రదర్శించనున్నాడని ఇంతకుముందు విడుదలైన టీజర్ చెబుతోంది. కరుప్పు రిలీజ్ తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక సూర్య 46, సూర్య 47 సెట్స్ పై ఉన్నాయి.
