Begin typing your search above and press return to search.

సూర్య ‘సీన్’ టీజర్.. పోలీస్ రోల్‌లో కొత్త టచ్!

లేటెస్ట్ గా ఆ సినిమా టైటిల్ టీజర్‌ ను తెలుగులోనూ రిలీజ్ చేయడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

By:  M Prashanth   |   17 Sept 2026 7:34 PM IST
సూర్య ‘సీన్’ టీజర్.. పోలీస్ రోల్‌లో కొత్త టచ్!
X

సూర్య సినిమా అంటేనే యాక్షన్.. ఆయన క్యారెక్టర్ అంటేనే ఓ స్పెషల్ ఇంపాక్ట్. ఇప్పుడు మరోసారి అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఆవేశంతో బ్లాక్‌ బస్టర్ అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న సీన్ మూవీతో సూర్య బిజీగా ఉన్నారు. లేటెస్ట్ గా ఆ సినిమా టైటిల్ టీజర్‌ ను తెలుగులోనూ రిలీజ్ చేయడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.

టైటిల్ టీజర్ చూస్తే.. ఈసారి సూర్యను పూర్తిగా కొత్త లుక్‌ లో చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. షార్ట్, టీషర్ట్‌ లో కనిపించిన సూర్య.. స్టైలిష్‌ గా ఎంట్రీ ఇస్తారు. అయితే లుక్ కంటే ఆయన క్యారెక్టర్ టీజర్‌ లో ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుతోంది. జైలులో ఖైదీల మధ్య నుంచి ఓ పోలీస్ అధికారి భుజంపై చేయి వేసుకుని సూర్య నడుచుకుంటూ వచ్చే సీన్ హైలైట్‌ గా నిలిచింది.

అసలు సూర్య రోల్ ఎలా ఉండబోతోందన్నది టీజర్‌ లోని ఒక్క డైలాగ్‌ తోనే మేకర్స్ చెప్పేశారు. 'ప్రేమ్ రాజ్ సర్ కనిపిస్తే ఖైదీలంతా అదో టైప్‌ లో బిహేవ్ చేస్తారు' అంటూ పోలీస్ అధికారి చెప్పిన డైలాగ్ అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది. అంటే.. జైలులో ఉన్న ఖైదీలకే ప్రేమ్ రాజ్ పేరు చెబితే ఓ రకమైన భయం లేదా వింత రెస్పాన్స్ వచ్చేంత స్పెషల్ పోలీస్ రోల్ అన్నమాట.

ఇక టీజర్ స్టార్టింగ్ లో వచ్చే వాయిస్ కూడా సూర్య రోల్ పై క్యూరియాసిటీ పెంచుతోంది. 'టాలెంటెడ్.. టాలెంటెడ్ అని రుద్ది రుద్ది చెత్త క్యారెక్టర్‌ ను మోసేయకండ్రా' అంటూ వినిపించిన డైలాగ్ తర్వాత సూర్య క్రైమ్ సీన్‌ లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత వచ్చే ‘'900 మందిలో ఒక చిల్లరగాడివి' అనే డైలాగ్ కూడా ఆయన రోల్ లోని యాటిట్యూడ్‌ ను చూపిస్తోంది.

సినిమాలో సూర్య కాస్త వింత ప్రవర్తనతో ఉండే పోలీస్ ఆఫీసర్‌ గా కనిపించనున్నట్లు టీజర్ హింట్ ఇచ్చింది. ఒకే చోట కూర్చుని సిగరెట్ కాలుస్తూ, తనదైన స్టైల్‌ లో వ్యవహరించే ప్రేమ్ రాజ్ పాత్ర చుట్టూనే స్టోరీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ తో పాటు కామెడీకి కూడా ఇంపార్టెన్స్ ఉన్న ఎంటర్టైనర్‌ గా సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.

ఇక సినిమాలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. ప్రేమలు ఫేమ్ నస్లెన్ కె. గఫూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఆ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. దీపావళి కానుకగా నవంబర్ 6న సీన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.