తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?
సూర్య, నజ్రియా నటించిన 'సీన్' సినిమాతో దర్శకుడు జీతూ మాధవన్‌కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పెరిగింది. వరుసగా మూడు విజయాలు అందుకున్న ఆయనతో సినిమా చేసేందుకు టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఓ టాలీవుడ్ యంగ్ హీరో స్వయంగా ఫోన్ చేసి జీతూతో సినిమా చేయాలని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది.
By: Ramesh Palla | 10 Nov 2026 10:34 AM ISTసూర్య హీరోగా నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించిన 'సీన్' మూవీ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణ వంటి పెద్ద సినిమాతో రావడంతో సీన్ ను చాలా మంది గుర్తించరని అంతా భావించారు. కానీ కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎంత పోటీలో ఉన్నా, ఎన్ని పెద్ద సినిమాల మధ్య ఉన్నా చిన్న సినిమా ను గుర్తిస్తారు, మంచి సినిమాలను ఆదరిస్తారని నిరూపితం అయ్యింది. సీన్ సినిమా మొదటి వారం ముగియక ముందే రూ.100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. రామాయణ జోరు కొనసాగుతున్న ఈ సమయంలోనే సీన్ సినిమాకు సైతం మంచి వసూళ్లు నమోదు అవుతున్నట్లు బాక్సాఫీస్ రిపోర్ట్ వస్తోంది. లాంగ్ రన్ లో కచ్చితంగా సీన్ మూవీ రూ.200 కోట్లకు మించి వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సీన్ మూవీ దర్శకుడు జీతూ మాధవన్ గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది.
సీన్ మూవీ దర్శకుడు జీతూ మాధవన్...
దర్శకుడు జీతూ మాధవన్‌కు సీన్ మూవీ తమిళంలో మొదటిది. అంతకు ముందు మలయాళంలో రెండు సినిమాలు చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు జీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మొదటగా రోమాంచకం సినిమాతో మలయాళ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. విభిన్నమైన హర్రర్ కాన్సెప్ట్ మూవీగా రోమాంచకం విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అప్పుడు జీతూ మాధవన్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఇతర భాషల హీరోలు ఆ సమయంలో జీతూ తో సినిమా ను చేయాలి అనేంతగా ఆసక్తి కనబర్చలేదు. కానీ ఎప్పుడైతే 'ఆవేశం' సినిమాతో వచ్చాడో అప్పుడే ఇతడిలో మంచి ప్రతిభ ఉందనే విషయాన్ని గుర్తించారు. సూర్య టీం నుంచి కాల్ రావడం, జీతూ సైతం ఆ సమయం కోసం ఎదురు చూడటం, చాలా స్పీడ్‌గా సీన్ రూపొందడం చకచకా జరిగి పోయాయి.
సూర్య సీన్ మూవీ కలెక్షన్స్...
సీన్ విడుదలైన తర్వాత సౌత్ తో పాటు నార్త్ లో కూడా జీతూ మాధవన్ గురించిన చర్చ మొదలైంది. విభిన్నమైన సినిమాలతో కమర్షియల్ హిట్స్ అందుకుంటూ వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన జీతూ మాధవన్ తో సినిమా ను చేసేందుకు పెద్ద నిర్మాతలు రెడీ అయ్యారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే ఇద్దరు నిర్మాతలు జీతూ మాధవన్ కు అడ్వాన్స్ ఇచ్చేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఒక నిర్మాత ఓపెన్ ఆఫర్‌గా తెలుగు హీరో లేదా మరే భాష హీరోతో సినిమా చేసినా పర్వాలేదు, మా బ్యానర్ లో ఒక సినిమా చేసి పెట్టు అని ఫోన్ లో మాట్లాడాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జీతూ మాధవన్ కు సీన్ తర్వాత ఒక్కసారిగా సీన్ పెరిగిందని చెప్పుకోవచ్చు. దాంతో జీతూ మాధవన్ దర్శకత్వంలో నటించేందుకు ఒక టాలీవుడ్ యంగ్ హీరో ఆసక్తి కనబర్చుతున్నాడని, స్వయంగా కాల్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పాడని తెలుస్తోంది.
టాలీవుడ్ స్టార్ హీరోతో జీతూ మాధవన్ మూవీ...
జీతూ మాధవన్ కు సీన్ మూవీ తర్వాత చాలా మంది హీరోలు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి ఉంటారు. అయితే టాలీవుడ్ హీరో నుంచి వచ్చిన కాల్ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆ హీరో తో చాలా మంది దర్శకులు సినిమాలు చేయాలని చూస్తున్నారు. అలాంటిది ఆ హీరో స్వయంగా జీతూ మాధవన్ కు ఫోన్ చేసి మరీ కలిసి వర్క్ చేద్దామని ప్రపోజల్ పెట్టాడట. దాంతో వీరి కాంబోలో మూవీ కచ్చితంగా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ హీరో చేస్తున్న మూవీ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా తర్వాత మరో సినిమా ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. కానీ ఆ సినిమాను చేస్తాడా లేదంటే జీతూ మాధవన్ దర్శకత్వంలో సినిమాను చేస్తాడా అనేది చూడాలి. మొత్తానికి వచ్చే ఏడాది కాకున్నా ఆ తర్వాత ఏడాదిలో అయినా జీతూ మాధవన్ తెలుగు హీరోతో పాన్ ఇండియా మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
