Begin typing your search above and press return to search.

డీఎస్పీ ప్రేమరాజ్ గ్లింప్స్.. సూర్య ఖాకీ మార్క్ మారనుందా?

అయితే కేవలం ఫన్ మాత్రమే కాదు, చివర్లో సూర్య చూపించిన రఫ్ అండ్ రా లుక్ సినిమాపై ఉన్న ఆసక్తిని పెంచింది.

By:  M Prashanth   |   26 Oct 2026 8:38 PM IST
డీఎస్పీ ప్రేమరాజ్ గ్లింప్స్.. సూర్య ఖాకీ మార్క్ మారనుందా?
X

సూర్య అనగానే టక్కున గుర్తొచ్చేది 'సింగం'లో ఆయన చూపించిన రౌద్రం, హై వోల్టేజ్ డైలాగులే. కానీ ఈసారి పరిస్థితి వేరు. మలయాళంలో 'రోమాంచం', 'ఆవేశం' లాంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన జితు మాధవన్ దర్శకత్వంలో సూర్య చేస్తున్న లేటెస్ట్ మూవీ 'సీన్' (Scene). లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి "డీఎస్పీ ప్రేమరాజ్" క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన 'రెస్పెక్టా' గ్లింప్స్ ఇప్పుడు నెట్టింట బజ్ క్రియేట్ చేసింది.

ఈ గ్లింప్స్ చూస్తుంటే సూర్య పాత పోలీస్ సినిమాల ఛాయలు ఎక్కడా కనిపించవు. కరోనా టైమ్‌లో ఒక క్రైమ్ స్పాట్‌కు వచ్చిన డీఎస్పీ ప్రేమరాజ్, అక్కడ తోటి కానిస్టేబుల్‌తో మాట్లాడే తీరుతోనే కామెడీ ట్రాక్ ఓపెన్ చేశారు. "సార్ గీర్ అని ఎందుకురా.. అన్న అని పిలవరాదా" అంటూ మొదలుపెట్టి, చివరకు కన్ఫ్యూజన్ లేకుండా సార్ అనే పిలవమని చెప్పడం దర్శకుడు జితు మార్క్ వింత హ్యూమర్‌ను గుర్తుచేస్తుంది.

అలాగే ఇన్వెస్టిగేషన్ మధ్యలో జనాలు గుమిగూడి ఉంటే.. "రీల్స్ చేసుకోవడానికి మాస్ గా ఉంటుంది, కెమెరా వెర్టికల్ గా పెట్టి తీయమనండి" అని సూర్య చెప్పే డైలాగ్ నేటి సోషల్ మీడియా ట్రెండ్‌కు పక్కాగా సింక్ అయింది. సీరియస్ మర్డర్ మిస్టరీని డీల్ చేస్తూనే, అందులో నేటి జెనరేషన్ యాటిట్యూడ్, సెటైరికల్ డైలాగ్స్ జొప్పించిన విధానం బాగుంది.

అయితే కేవలం ఫన్ మాత్రమే కాదు, చివర్లో సూర్య చూపించిన రఫ్ అండ్ రా లుక్ సినిమాపై ఉన్న ఆసక్తిని పెంచింది. గుబురు గడ్డం, నోట్లో సిగరెట్‌తో మంటల మధ్యలో నుంచి నడుచుకుంటూ వచ్చే షాట్ మాస్ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫన్ క్యారెక్టర్‌కు, ఈ రఫ్ లుక్‌కు మధ్య ఉన్న లింక్ ఏంటనేదే స్క్రీన్ ప్లేకి మెయిన్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.

జితు సినిమాలకు ప్రాణం పోసే సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌లోనూ మరోసారి తన స్టామినా చూపించింది. సీరియస్ టోన్ లేకుండా బీట్స్ చాలా ఫ్రెష్‌గా అనిపించాయి. 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కీలక పాత్రలో నటిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రొటీన్ లౌడ్ కాప్ డ్రామాలను కాకుండా, క్యారెక్టర్ డ్రివెన్ హ్యూమర్‌తో ఒక ఇన్వెస్టిగేషన్ కథను చెప్పే ప్రయత్నమిది. అయితే జితు మాధవన్ మలయాళంలో వర్కవుట్ చేసిన ఈ డార్క్ అండ్ క్రేజీ కామెడీ, తమిళ, తెలుగు ఆడియన్స్‌కు ఏ మేరకు కనెక్ట్ అవుతుందనే చూడాలి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ కూడా రానున్నాయి.