Begin typing your search above and press return to search.

సూర్య... 'అమ్మో ఇది ఎవర్రా'..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా అంటేనే మాస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం సీన్ మూవీలో సూర్య కొత్తగా కనిపించబోతున్నారు.

By:  M Prashanth   |   8 Oct 2026 8:20 PM IST
సూర్య... అమ్మో ఇది ఎవర్రా..
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా అంటేనే మాస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం సీన్ మూవీలో సూర్య కొత్తగా కనిపించబోతున్నారు. ఆ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ అమ్మో ఇది ఎవర్రా ఇప్పుడు యూత్‌ ను టార్గెట్ చేస్తూ గట్టిగానే వైరల్ అయ్యేలా కనిపిస్తోంది. పాట మొదలైన దగ్గర నుంచి వచ్చే బీట్స్, సూర్య-నజ్రియా కాంబినేషన్, క్యాచీగా ఉన్న పల్లవి.. ఇవన్నీ కలిసి సాంగ్‌ కు మంచి ఎనర్జీ ఇచ్చాయి.





సూర్య లీడ్ రోల్ లో మలయాళ దర్శకుడు జిత్తు మాధవన్ తెరకెక్కిస్తున్న సినిమా సీన్. ఆవేశం, రోమాంచం వంటి సినిమాలతో తనదైన స్టైల్ చూపించిన జిత్తు మాధవన్.. ఈసారి సూర్యతో యాక్షన్ థ్రిల్లర్‌ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాపై మంచి హైప్ ఉండగా.. ఇప్పుడు అమ్మో ఇది ఎవర్రా పాటతో అంచనాలు పెరిగాయి. ఆ సాంగ్ లో పెద్దగా కష్టమైన పదాలు కనిపించకుండా.. వెంటనే కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు.

ఒక్కసారి వింటే గుర్తుండిపోయేలా ఉండటం ఆ పాటకు పెద్ద ప్లస్. సోషల్ మీడియాలో చిన్న వీడియోలు, రీల్స్‌ కు కూడా సాంగ్ బాగా సెట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా ఆ పాటకు మలయాళ మ్యూజిక్ సెన్సేషన్ సుశిన్ శ్యామ్ అందించిన మ్యూజిక్ హైలైట్‌ గా నిలిచింది. ట్రెండీ బీట్స్‌ తో పాటను చాలా ఎనర్జిటిక్‌ గా తీసుకెళ్లారు. మ్యూజిక్‌ లో ఉన్న వైబ్ యూత్‌ కు కనెక్ట్ అయ్యేలా ఉంది.

తెలుగు వెర్షన్‌ ను వినాయక్ ఎనర్జిటిక్‌ గా పాడారు. ఆయన వాయిస్ జోష్‌ ను మరింత పెంచింది. రకేందు మౌళి సాహిత్యం సింపుల్‌ గా, క్యాచీగా సాగింది. ఇక లిరికల్ వీడియోలో సూర్య, నజ్రియా కనిపించే విధానం కూడా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి కాంబినేషన్ సినిమాకు కొత్త ఫీల్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. సూర్య మరోసారి పోలీస్ పాత్రలో కనిపించబోతుండటం కూడా సినిమాపై హైప్ పెంచుతోంది.

సీన్ లో సూర్య డీఎస్పీ ఇంబరాజ్ అనే విభిన్నమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఆ క్యారెక్టర్ నార్మల్ పోలీస్ రోల్ లా కాకుండా కొంత డిఫరెంట్‌ గా, స్టైలిష్‌ గా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు ప్రేమలు ఫేమ్ నస్లెన్ సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఒక సీరియల్ కిల్లర్‌ ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది.

అయితే జిత్తు మాధవన్ మార్క్ డార్క్ కామెడీ, యాక్షన్ టచ్ కూడా ఉండటంతో సీన్ రెగ్యులర్ పోలీస్ థ్రిల్లర్‌ లా కాకుండా కొత్తగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కు ఫస్ట్ సింగిల్ కు వస్తున్న రెస్పాన్స్ జోష్ నింపిందని చెప్పాలి. మరి ఫ్యూచర్ లో మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో.. సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.