రోలెక్స్ కథలో విలన్ ఎవరు మరి?
సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే.. పవర్ ఫుల్ విలన్ ఉండాలి. కానీ రోలెక్స్ విషయంలో లెక్క మారిపోతుంది.
By: M Prashanth | 4 Sept 2026 2:24 PM ISTవిక్రమ్ లో కొన్ని నిమిషాల పాటు కనిపించిన రోలెక్స్ రోల్.. సినిమా పూర్తయిన తర్వాత కూడా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. సూర్య కనిపించింది కొద్దిసేపే అయినా.. ఆ రోల్ కి వచ్చిన హైప్ మాత్రం ఏకంగా ఓ స్పెషల్ మూవీ కోసం డిమాండ్ చేసే రేంజ్ కి వెళ్లింది. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ రోలెక్స్ కథపై పనిచేస్తున్నారనే వార్తలతో మరోసారి ఆ పాత్రపై చర్చ మొదలైంది. అయితే ఇక్కడే రోలెక్స్ కథలో విలన్ ఎవరనే ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతోంది.
సాధారణంగా స్టార్ హీరో సినిమా అంటే.. పవర్ ఫుల్ విలన్ ఉండాలి. కానీ రోలెక్స్ విషయంలో లెక్క మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హీరోగా కనిపించేది సూర్యే అయినా.. అతడి రోల్ మాత్రం పాజిటివ్ కాదు. విక్రమ్ లో రోలెక్స్ ను ఓ వైలెంట్ డ్రగ్ వరల్డ్ కు అధిపతిగా పరిచయం చేశారు. దీంతో కథలో రోలెక్స్ ను అడ్డుకునే పాత్రే అసలైన హీరోగా మారే అవకాశం కనిపిస్తోంది. అంటే హీరో సూర్యనే.. కానీ కథలో హీరో రోలెక్స్ కాదు! ఇదే ఆ ప్రాజెక్ట్ ను మిగతా సినిమాల కంటే భిన్నంగా మార్చే అంశం కావచ్చు.
రోలెక్స్ కు ఎదురుగా ఎలాంటి పాత్రను తీసుకొస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. కేవలం విలన్ గా పెట్టడం కంటే.. రోలెక్స్ సామ్రాజ్యాన్ని వ్యూహంతో ఎదుర్కొనే పాత్రను సృష్టిస్తే స్టోరీ ఆసక్తికరంగా మారొచ్చు. రోలెక్స్ దగ్గర డబ్బు, మనుషులు, ఆయుధాలు ఉంటే.. అతడిని ఎదుర్కొనే వ్యక్తి తెలివితో పోరాడేలా చూపించవచ్చు. మరో ఛాన్స్ LCUలో ఇప్పటికే ఉన్న పాత్రలతో లింక్ చేయడం. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే పలు పాత్రలు పరిచయమయ్యాయి.
ఇప్పుడు రోలెక్స్ కథ అదే వరల్డ్ లో కొనసాగితే.. అతడి ఎదుట కొత్త రోల్ వస్తుందా? లేక ఇప్పటికే తెలిసిన పాత్రే రోలెక్స్ ను ఎదుర్కొంటుందా? అనేది ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ కు అవకాశం ఉంది. రోలెక్స్ కు బయట నుంచి ఓ విలన్ రావడం కంటే.. అతడి వరల్డ్ లో మరో వ్యక్తి తిరుగుబాటు చేస్తే కథ మరింత కొత్తగా ఉంటుంది. కథకు మంచి డ్రామాను తీసుకురావచ్చు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి రూమర్లే.
కానీ దర్శకుడు లోకేశ్ మాత్రం రోలెక్స్ సోలో సినిమా తన ప్లాన్ లో ఉందని స్పష్టం చేశారు. సూర్య కూడా లోకేశ్ కథపై పనిచేస్తున్నారని ఇటీవల వెల్లడించారు. ఇక రోలెక్స్ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత.. దీనికి హీరో అవసరం లేకపోవడమే. రోలెక్స్ ను ఢీకొనే రోల్ లో ఎవరో ఒకరు రంగంలోకి దిగితే.. ప్రేక్షకులు అటు వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే సమయంలో సూర్య తన విలన్ షేడ్స్ ఉన్న పాత్రతో కథను ముందుకు నడిపించాలి. అందుకే సినిమాలో అసలు ప్రశ్న విలన్ ఎవరనేది కాదు. రోలెక్స్ ను ఎదుర్కొనేంత స్ట్రాంగ్ యాక్టర్ ఎవరు? అనేదే. సూర్యనే మెయిన్ అట్రాక్షన్ గా పెట్టుకుని.. హీరో లేని హీరో కథను లోకేశ్ ఎలా తెరకెక్కిస్తారన్నదే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
