పాన్ ఇండియా సంచలనానికి సూర్య టచ్ లో!
కోలీవుడ్ స్టార్ సూర్య పాన్ ఇండియా అటెంప్ట్ `కంగువ` ఎంతగా నిరుత్సాహ పరిచిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఏమాత్రం ఊహకు అందని ఫలితాన్ని సాధించింది.
By: Srikanth Kontham | 4 Oct 2025 7:00 PM ISTకోలీవుడ్ స్టార్ సూర్య పాన్ ఇండియా అటెంప్ట్ `కంగువ` ఎంతగా నిరుత్సాహ పరిచిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఏమాత్రం ఊహకు అందని ఫలితాన్ని సాధించింది. సూర్య కెరీర్ లోనే ఓ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ఫలితంతో సూర్య చాలా డిస్టర్బ్ అయ్యాడు. దీంతో ఇప్పట్లో పాన్ ఇండియా సినిమాలు చేయనంటూ రీజనల్ కంటెంట్ కే పరిమితయ్యాడు. వరుస పాన్ ఇండియా ప్రయత్నాలతో అభాసు పాలు అవ్వడం కంటే? కొన్నాళ్ల పాటు రీజనల్ మార్కెట్ లోనే సినిమాలు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు.
హైదరాబాద్ లో సమావేశమా?
ప్రస్తుతం తమిళ్ తో పాటు తెలుగులోనూ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఇటీవలే సూర్య- పాన్ ఇండియా సంచలనం ప్రశాంత్ నీల్ తో హైదరాబాద్ లో భేటీ అయ్యారట. ఓస్టార్ హోటల్ లో ఇద్దరు సమావేశ మైనట్లు తెలిసింది. అయితే ఈ భేటీ సినిమా కోసమా? వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించిందా? అన్నది క్లారిటీ రావాలి. ఏదేమైనా సమాశేమైన నేపథ్యంలో సినిమా డిస్కషన్ రాకుండా ఉండదు.
క్లారిటీ లేని షూటింగ్ లు:
ఇద్దరు సినిమా రంగానికి సంబంధించిన వారే కాబట్టి! కలిసి సినిమా చేయాలి? అన్న ఆలోచన లేకుండా ఉండలేరు. సూర్య లాంటి నటుడికి ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా మేకర్ దొరికితే అక్కడ అద్భుతమే జరుగుతుంది. అది జరగాలిన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అందుకు చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా `డ్రాగన్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికీ పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది ఇంతవరకూ క్లారిటీ లేదు.
వాళ్లకు పోటీగా సూర్య:
ఈ సినిమా రిలీజ్ అయిన అనంతరం ప్రభాస్ తో `సలార్ 2` పట్టాలెక్కించాలి. ఇదీ భారీ కాన్వాస్ పై రూపొం దిస్తున్న సినిమా కాబట్టి? చిత్రీకరణ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా మహేష్, చరణ్, బన్నీ లాంటి స్టార్ హీరోలు కూడా నీల్ తో పని చేయడానికి సిద్దంగా ఉన్నారు. ఇంత పోటీలో సూర్య తో ఛాన్స్ అందు కోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం సూర్య రీజనల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
