Begin typing your search above and press return to search.

ఇది సూర్య భాయ్ టైం.. సలాం కొట్టేలా చేస్తాడా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేడు. సూర్య కంబ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

By:  Ramesh Boddu   |   21 Nov 2025 11:39 AM IST
ఇది సూర్య భాయ్ టైం.. సలాం కొట్టేలా చేస్తాడా..?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈమధ్య అసలేమాత్రం ఫాం లో లేడు. సూర్య కంబ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కంగువ, రెట్రో లాంటి సినిమాల మీద చాలా హోప్స్ పెట్టుకున్న సూర్య ఆ రెండు సినిమాల రిజల్ట్ తో ఆలోచనలో పడ్డాడు. ఐతే నెక్స్ట్ సినిమాకు మరింత ఎనర్జీతో తన ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సూర్య కరుప్పు సినిమా చేశాడు. ఆ సినిమా పూర్తై రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక నెక్స్ట్ సూర్య తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ సినిమాగా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు.

వర్సటైల్ యాక్టర్ సూర్య..

సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసి మంచి ఫలితాలు అందుకున్న వెంకీ అట్లూరి సూర్య లాంటి వర్సటైల్ యాక్టర్ తో చేస్తున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి వెంకీ సూర్యతో ఎలాంటి కథతో రాబోతున్నాడంటూ ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఐతే సూర్య మాత్రం ఈ సినిమాతో పక్కా తన మార్క్ కమర్షియల్ హిట్ అందుకుంటాడనే కాన్ ఫిడెన్స్ ఫ్యాన్స్ లో ఉంది.

కరుప్పు రిలీజ్ తర్వాత సూర్య మరోసారి తన మునుపటి ఫాం లోకి వస్తారని దాన్ని వెంకీ అట్లూరి సినిమా కూడా కొనసాగిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత లేటెస్ట్ గా మరో తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సూర్యతో సినిమాకు రెడీ అవుతున్నాడట. సూర్య ఈ సినిమా కూడా ఓకే చేస్తే మాత్రం మరో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీ షురూ అయినట్టే. గజినీ సినిమాతో సూర్యకు తెలుగులో కూడా సూపర్ పాపులారిటీ వచ్చింది. ఆ సినిమా తర్వాత దాదాపు సూర్య నటించే ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు.

తెలుగులో కూడా బాక్సాఫీస్ షేక్ చేసే ఛాన్స్..

ఐతే ప్రస్తుతం కోలీవుడ్ హీరోల్లో ధనుష్, కార్తీ, శివ కార్తికేయన్ తప్ప మిగతా హీరోల సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వట్లేదు. ఆల్రెడీ సూర్యకు తెలుగులో కూడా స్టార్ క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా సూర్య అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా బాక్సాఫీస్ షేక్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగు దర్శక నిర్మాతలు చేస్తున్న సినిమాలు కాబట్టి తెలుగులో భారీ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ రాబోతున్న సినిమాలతో సూర్య భాయ్ తన అసలు సిసలు మాస్ స్టామినా ఏంటో చూపిస్తాడని ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా సూర్య లైనప్ చూసి సూపర్ హ్యాపీగా ఉన్నారు.

సూర్య తిరిగి ఫాంలోకి వస్తే మాత్రం ఆయనకు ఉన్న తెలుగు, తమిళ మార్కెట్ తో అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. ఆ లైనప్ తోనే సూర్య వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు. వివేక్ ఆత్రేయ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. అది కూడా ఫిక్స్ అయితే కచ్చితంగా సూర్య ఫైర్ స్టోర్మ్ షురూ అయినట్టే లెక్క.