సూర్య మూవీ గ్రాఫిక్స్.. తప్పు ఒప్పుకోవడం గ్రేటే కదా!
ముఖ్యంగా సింహంతో ఉన్న యాక్షన్ సీక్వెన్సులు, కొన్ని సీజీ షాట్ల క్వాలిటీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ఇప్పుడు ఆర్జే బాలాజీ రెస్పాండ్ అయ్యారు.
By: M Prashanth | 23 Jun 2026 5:24 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన కరుప్పు మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ, ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొన్ని సీన్స్ లోని గ్రాఫిక్స్ పై ప్రేక్షకుల నుంచి విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా సింహంతో ఉన్న యాక్షన్ సీక్వెన్సులు, కొన్ని సీజీ షాట్ల క్వాలిటీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ఇప్పుడు ఆర్జే బాలాజీ రెస్పాండ్ అయ్యారు.
సినిమాలోని కొన్ని గ్రాఫిక్స్ షాట్లు అనుకున్న స్థాయిలో రాకపోవడం వెనుక ఫైనాన్షియల్, టెక్నికల్ రీజన్స్ ఉన్నాయని బాలాజీ వెల్లడించారు. ఒక రోల్ ఫేస్ ను మార్చే హెడ్ రీప్లేస్మెంట్ వంటి సీజీ పనులను క్వాలిటీ పూర్తి చేయాలంటే కనీసం 8 నెలల సమయం అవసరమని చెప్పారు. అలాంటి పనుల కోసం ముందుగానే గ్రాఫిక్స్ సంస్థలకు పేమెంట్స్ చేయాల్సి ఉంటుందని, కానీ తాము మాత్రం చెల్లించలేకపోయామని తెలిపారు.
అయితే ఆ సీన్స్ ను పూర్తిగా డిలీట్ చేసే ఛాన్స్ కూడా తమకు లేదని బాలాజీ పేర్కొన్నారు. కథకు అవసరమైన సీన్స్ కావడంతో వాటిని సినిమాలో అలాగే ఉంచాల్సి వచ్చిందన్నారు. ముఖ్యంగా సింహంతో కూడిన ఫైట్ సీన్ లో తక్కువ షాట్లను యూజ్ చేసి సీన్స్ ను పూర్తి చేశామని చెప్పారు. థియేటర్లలో ఆ మిస్టేక్స్ ను ఎక్కువ మంది గమనించలేదని, కానీ ఓటీటీ విడుదల తర్వాత ప్రేక్షకులు ప్రతి ఫ్రేమ్ ను అబ్జర్వ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
సిల్వర్ స్క్రీన్ పై కనిపించని చిన్న చిన్న తప్పులు, ఇంట్లో చూసేటప్పుడు క్లియర్ గా కనిపించే ఛాన్స్ ఉంటుందని అన్నారు. అందుకే ఇప్పుడు ఆ సీన్స్ పై ఎక్కువ చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. ప్రేక్షకుల విమర్శలను తాము రిసీవ్ చేసుకుంటామని బాలాజీ చెప్పారు. 'మా తప్పులు మాకు తెలుసు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్స్ కంటే ఎక్కువ తప్పుల ఫోటోలు నా దగ్గరే ఉన్నాయి' అంటూ నవ్వుతూ చెప్పారు
తమకు మిస్టేక్స్ పై పూర్తి అవగాహన ఉందని, వాటిని దాచిపెట్టే ప్రయత్నం చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. సినిమాలో యాక్షన్ సీన్స్ షూటింగ్ టైమ్ లో హీరోతో పాటు స్టంట్ డబుల్స్ ను కూడా ఉపయోగిస్తారని, ఆ సమయంలో లైటింగ్, కంటిన్యుటీ సమస్యలు తలెత్తే అవకాశముంటుందని బాలాజీ వివరించారు. అలాంటి విషయాలను సీజీ ద్వారా సరిచేయడానికి ఎక్కువ సమయం, ఖర్చు అవసరమవుతుందని చెప్పారు.
ఆడియన్స్ నుంచి వచ్చిన విమర్శలపై సారీ చెబుతూ, ప్రేక్షకుల అభిప్రాయాన్ని ఫీడ్ బ్యాక్ గా తీసుకుంటామని బాలాజీ పేర్కొన్నారు. ఇకపై ప్లాన్ తో గ్రాఫిక్స్ పనులను మరింత బెస్ట్ గా పూర్తి చేసేలా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఏదేమైనా ఇప్పుడు కరుప్పు మూవీలోని గ్రాఫిక్స్ పై ప్రేక్షకుల నుంచి విమర్శలను, చేసిన తప్పులను డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఇప్పుడు ఒప్పుకోవడం గ్రేట్ అని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
