అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన సూర్య
సినీ హీరోలకు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూపులకు చెందిన వాళ్లు ఫ్యాన్స్ గా ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 6 Jan 2026 6:31 PM ISTసినీ హీరోలకు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూపులకు చెందిన వాళ్లు ఫ్యాన్స్ గా ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. పిల్లలైతే తమ రూమ్స్ లో ఇష్టమైన హీరోల ఫోటోలను పెట్టుకుంటారు, అదే పెద్ద వాళ్లైతే రిలీజ్ నాడే తమ ఫేవరెట్ హీరోల సినిమాలను చూడటం చేస్తుంటారు. ఇంకొందరైతే హీరోల బర్త్ డే సందర్భంగా అన్నదానాలు, రక్తదానాలు లాంటివి చేస్తూ తమ అభిమానాన్ని బయటపెడుతుంటారు.
హీరోల కోసం అభిమానులు ఇన్ని చేస్తున్నారు బాగానే ఉంది మరి అభిమానుల కోసం హీరోలు ఏం చేస్తారని డౌట్ రావొచ్చు. దానికి అందరూ చెప్పే సమాధానం సినిమాలు చేస్తున్నారు కదా, అవి చేసేది ఫ్యాన్స్ కోసమే కదా అని చెప్తుంటారు. కానీ తమిళ హీరోలు మాత్రం దీనికి అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తన అభిమానుల్ని సూర్య రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు.
తన బుల్లి ఫ్యాన్ ను కలుసిన సూర్య
రీసెంట్ గా సూర్య తన బుల్లి అభిమానిని కలుసుకున్నారు. తనను అమితంగా ఇష్టపడే ఓ అభిమానిని సూర్య కలిసి, వారితో కాసేపు టైమ్ స్పెండ్ చేసి, ఫోటోలు దిగారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వీడియోలో ఆ బాలుడి ఆనందం చూస్తుంటే ఏమిచ్చినా దాన్ని కొనలేమనే స్థాయిలో ఉంది. సూర్యను చూడగానే ఆ పిల్లాడి కళ్లు సంతోషంతో నిండిపోయాయి.
లేడీ ఫ్యాన్ పెళ్లికి వెళ్లి సర్‌ప్రైజ్
అయితే సూర్య ఇప్పుడే కాదు, రీసెంట్ గా ఓ మహిళా అభిమాని పెళ్లికి కూడా వెళ్లి ఆమెకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన అభిమాని కాజల్ పెళ్లికి ఆమెకు తెలియకుండా వెళ్లి సూర్య ఆమెకు షాకివ్వగా, సడెన్ గా తన అభిమాన హీరోని చూసిన పెళ్లికూతురు కాజల్ ఆశ్చర్యపోయి ఎమోషనల్ అయ్యారు. సూర్యనే కాదు, తమిళంలో పలు హీరోలు తమ అభిమానుల పెళ్లి, ఇతర శుభకార్యాలకు హాజరైన సందర్భాలున్నాయి.
