Begin typing your search above and press return to search.

22 ఏళ్ల తర్వాత కలువనున్న స్టార్ హీరో, దిగ్గజ దర్శకుడు!

ఇప్ప‌టికే మణిరత్నం `ఇంజి వెల్లమ్` అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అయితే అందులో హీరో ఎవ‌రు? అన్న‌ది క్లారిటీ లేదు.

By:  Srikanth Kontham   |   1 Oct 2026 3:00 PM IST
22 ఏళ్ల తర్వాత కలువనున్న స్టార్ హీరో, దిగ్గజ దర్శకుడు!
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య -దిగ్గజ దర్శకుడు మణిరత్నం మరోసారి చేతులు కలపనున్నట్లు సమాచారం. ఇద్ద‌రి కాంబినేషన్‌లో ఓ కొత్త ప్రాజెక్ట్ గురించి పరిశ్రమలో జోరుగా చర్చ సాగుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం ఈ కాంబినేష‌న్ లో రిలీజ్ అయిన‌ `యువ‌` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. కాలేజీ రాజ‌కీయాలు నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా అప్ప‌టి యువ‌త‌ను ఓ ఊపు ఊపేసింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ ద్వ‌యం చేతులు క‌ల‌ప‌లేదు.ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రోసారి కాంబినేష‌న్ సెట్ అవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇప్ప‌టికే మణిరత్నం `ఇంజి వెల్లమ్` అనే చిత్రం తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. అయితే అందులో హీరో ఎవ‌రు? అన్న‌ది క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాజెక్ట్ కే సూర్య సైన్ చేసాడ‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సూర్య న‌టిస్తోన్న రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. జీతు మాధ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `సీన్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. అలాగే `జైభీమ్` ద‌ర్శ‌కుడు జ్ఞాన్ వేల్ తో మ‌రోసారి జ‌త క‌ట్టారు.

అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెర‌కెక్కాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌లతో పాటు మణిరత్నం దర్శకత్వంలో నటించే చిత్రానికి సంబంధించిన షెడ్యూళ్లను ప్లాన్ చేసే పనిలో సూర్య ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం తనదైన శైలిలో స్క్రిప్ట్‌కు పదునుపె డుతున్నారని, సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక త్వరలోనే పూర్తి కానుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ భారీ ప్రాజెక్ట్‌‌ను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ప్రతిభావంతులైన నటుడు- దిగ్గజ దర్శకుడు మరోసారి కలుస్తుండటంతో సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. వైవిధ్యమైన కథాంశాలతో విభిన్న పాత్రలు పోషించే సూర్యను, మణిరత్నం ఏ విధంగా ఆవిష్కరిస్తారో? చూడాలని సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మేకర్స్ నుంచి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.