Begin typing your search above and press return to search.

హీరోయిన్ కు హీరో రిక‌మండీష‌న్..ఏం జ‌రిగిందంటే?

ప్ర‌స్తుతం ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వెంకీ అట్లూరీ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సూర్య‌కు జోడీగా డైరెక్ట‌ర్ ముందుగా మ‌రో హీరోయిన్ అనుకున్నారుట‌.

By:  Srikanth Kontham   |   31 Aug 2025 9:30 AM IST
హీరోయిన్ కు హీరో రిక‌మండీష‌న్..ఏం జ‌రిగిందంటే?
X

ఇండ‌స్ట్రీలో రిక‌మండీష‌న్లు అన్న‌వి రేర్. రిక‌మండ్ చేయాల‌న్నా ట్యాలెంట్ ఉంటేనే సాధ్య‌వ‌మ‌తుంది. అందులోనూ హీరోయిన్ల ప‌రంగా చూస్తే? పెద్దగా ఎలాంటి రిక‌మండీష‌న్లు క‌నిపించ‌వు. రికమండ్ చేస్తే ఎన్నో ర‌కాల సందేహాల‌కు తావిచ్చే అవ‌కాశాలుంటాయి. ఈ కోణంలో కూడా ముందుకు రావ‌డానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. ర‌క‌ర‌కాల క‌థ‌నాల‌కు దారి తీసే అవ‌కాశం ఏ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనైనా క‌నిస్తుం టుంది. తాజాగా స్టార్ హీరో సూర్య త‌న సినిమాకు హీరోయిన్ గా మ‌మితా బైజును తీసుకోవాల‌ని సూచిం చిన‌ట్లు తెలిసింది.

మ‌ధ్య‌లో ఆగిన చిత్రం

ప్ర‌స్తుతం ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వెంకీ అట్లూరీ ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో సూర్య‌కు జోడీగా డైరెక్ట‌ర్ ముందుగా మ‌రో హీరోయిన్ అనుకున్నారుట‌. కానీ సూర్య మ‌మితాను తీసుకుం దామ‌ని సూచించారుట. హీరో మాట‌కు క‌ట్టుబ‌డి వెంకీ ఆమెను తీసుకున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్. అందుకు ఓ బ‌ల‌మైన కార‌ణం కూడా తెర‌పైకి వ‌చ్చింది. గ‌తంలో ఓ చిత్రంలో సూర్య‌తో న‌టించే అవ‌కాశం మ‌మితా బైజుకు వ‌రించింది. అదే బాల ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లైన `వ‌ణంగ‌న్`. సూర్య‌-మ‌మిత‌ల‌పై కొన్ని స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించారు.

అవ‌కాశం అలా వ‌చ్చింది:

కానీ అనివార్య కార‌ణాల‌తో ఈ ప్రాజెక్ట్ నుంచి ముందుగా సూర్య త‌ప్పుకున్నారు. అనంత‌రం మిమితా ను తొల‌గించారు. అలా ఇద్ద‌రు క‌లిసి న‌టించాల్సిన సినిమా చేతులు మారింది. సూర్య‌తో క‌లిసి న‌టించాలి అన్న‌ది మ‌మిత డ్రీమ్. అప్ప‌టి నుంచి అత‌డితో ఛాన్స్ రాలేదు. దీంతో సూర్య తెలుగు సినిమాలో మ‌మి తాకు అవ‌కాశం క‌ల్పించారు. త‌న కార‌ణంగా న‌టి ఛాన్స్ కోల్పోకూడ‌దు అన్న దాతృత్వంతో సూర్య మ‌మిత విష‌యంలో ఓ అడుగు ముందుకేసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ ఒట్టు ఇంకా గట్టు మీదే:

నిజానికి సూర్య ఆమెకు ఎలాంటి ప్రామిస్ చేయ‌లేదు. కానీ స్నేహ భావంతో ఛాన్స్ క‌ల్పించారు. ఇండ‌స్ట్రీలో హీరో-హీరోయిన్ మ‌ధ్య ఇలాంటి వాతావ‌ర‌ణం ఉంటే? మ‌రింత మంది వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉం టుంది. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం తెలుగులో ఓ పెద్ద హీరోతో ఓ సినిమా మొద‌లైంది. అందులో ముంబై న‌టి హీరోయిన్. హీరో-హీరోయిన్ పై షూటింగ్ కూడా చేసారు. కానీ అనూహ్యంగా ఆ హీరోయిన్ని అర్దం త‌రంగా తొల‌గించారు. దీంతో ఆ హీరో అదే స‌మ‌యంలో త‌న త‌ర్వాత సినిమాలో అవ‌కాశం ఇస్తాన‌ని ప్రామిస్ చేసాడు. కానీ ఇంత వ‌ర‌కూ ఆ ప్రామిస్ నిల‌బెట్టుకోలేదు.