Begin typing your search above and press return to search.

ఇక కోలీవుడ్‌ లో డామినేషన్ సూర్యదేనా.. కానీ..

కోలీవుడ్ లో ప్రస్తుతం ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా విజయ్, అజిత్, రజనీకాంత్ చుట్టూ తిరిగిన స్టార్ డామినేషన్ ఇప్పుడు కొత్త దిశలోకి వెళ్తుందనే చర్చ నడుస్తోంది.

By:  M Prashanth   |   24 May 2026 9:46 AM IST
ఇక కోలీవుడ్‌ లో డామినేషన్ సూర్యదేనా.. కానీ..
X

కోలీవుడ్ లో ప్రస్తుతం ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా విజయ్, అజిత్, రజనీకాంత్ చుట్టూ తిరిగిన స్టార్ డామినేషన్ ఇప్పుడు కొత్త దిశలోకి వెళ్తుందనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాలపై దృష్టి పెట్టడం, అజిత్ వరుసగా సినిమాలు చేయకపోవడం, రజనీకాంత్ తక్కువ సినిమాలు చేయడంతో సూర్యకు భారీ అవకాశాలుగా మారుతున్నాయి. దీంతో నెక్స్ట్ బిగ్ డామినేషన్ సూర్యదేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

సూర్య కెరీర్‌ ను పరిశీలిస్తే... సింగం లాంటి మాస్ కమర్షియల్ చిత్రాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆయన.. మరోవైపు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో తన నటనలో ఉన్న వైవిధ్యాన్ని నిరూపించారు. ముఖ్యంగా జై భీమ్ సినిమా ఆయనకు నేషనల్ వైడ్ గా ప్రశంసలు తెచ్చిపెట్టింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో పాటు స్ట్రాంగ్ స్టోరీలను కూడా ఎంచుకునే హీరోగా సూర్య ఇమేజ్ మరింత బలపడింది.

ఇక తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇతర తమిళ హీరోలతో పోలిస్తే తెలుగులో సూర్యకు ఉన్న క్రేజ్స్ స్ట్రాంగ్‌ గా కనిపిస్తుంది. అందుకే టాలీవుడ్ నిర్మాతలు కూడా ఇప్పుడు సూర్యతో స్ట్రెయిట్ సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మరోవైపు నిర్మాతగా కూడా సూర్య తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తన ‘2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. చిన్న సినిమాలకు సపోర్ట్ ఇవ్వడం, కొత్త కథలను ప్రోత్సహించడం వంటి అంశాలు కూడా ఆయనకు గౌరవాన్ని తీసుకొచ్చాయి. హీరోగా మాత్రమే కాకుండా, పరిశ్రమ అభివృద్ధిని ఆలోచించే వ్యక్తిగా కూడా సూర్యను చాలా మంది చూస్తున్నారు.

ప్రస్తుతం అనేక మంది దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు సూర్య వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. భారీ బడ్జెట్ ప్రాజెక్టులు, పాన్ ఇండియా కథలు, స్టార్ డైరెక్టర్ల ఫోకస్ ఇప్పుడు సూర్యపై పడుతున్నట్లు తెలుస్తోంది. సరైన టైమ్ లో సరైన ప్రాజెక్టులు పడితే సూర్య మార్కెట్ మరింత పెరిగే ఛాన్సులు ఉన్నాయని చెప్పాలి. అయితే.. ఈ మొత్తం పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన విషయం మాత్రం మర్చిపోకూడదు.

స్టార్ డామినేషన్‌ ను చివరికి నిర్ణయించేది ప్రేక్షకులే. కేవలం మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్, అవకాశాలు ఉంటే సరిపోదు. మంచి కథలు, స్ట్రాంగ్ కంటెంట్, ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు ఉంటేనే ఆ డామినేషన్ ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన కొన్ని స్టార్ హీరోల సినిమాలు భారీ హైప్ ఉన్నప్పటికీ కంటెంట్ వీక్ గా ఉండటంతో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి.

సూర్య విషయంలో కూడా ఇప్పుడు అదే కీలకంగా మారింది. ఆయన ఎంచుకునే కథలు, దర్శకులు, ప్రాజెక్టులపై తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్ ను డిసైడ్ చేయనున్నాయి. ఒకవేళ వరుసగా స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తే కోలీవుడ్‌ లో సూర్య నెక్స్ట్ డామినేటింగ్ స్టార్‌ గా ఎదగడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ కథల ఎంపికలో చిన్న తప్పిదాలు జరిగినా ఆ అడ్వాంటేజ్ త్వరగా తగ్గిపోవచ్చు. ఏదేమైనా ప్రేక్షకులను మెప్పించే కథలే ఆయన డామినేషన్‌ ను నిలబెడతాయా లేదా అనేది నిర్ణయించబోతున్నాయి.