Begin typing your search above and press return to search.

సూర్య @ 51.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాయి. సూర్య ఎప్పుడు కూడా తన ఏజ్ ని హైడ్ చేస్తూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తారు.

By:  Ramesh Boddu   |   22 Aug 2025 3:00 PM IST
సూర్య @ 51.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్..!
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాయి. సూర్య ఎప్పుడు కూడా తన ఏజ్ ని హైడ్ చేస్తూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తారు. దాదాపు ఎప్పుడు చూసినా కూడా క్లీన్ షేవ్ తో నీట్ గా హ్యాండ్సం గా కనిపిస్తారు. ఐతే ఇదే సూర్య ని తన ఫ్యాన్స్ కి దగ్గర చేస్తుంది. ఒక 20 ఏళ్ల క్రితం సూర్య ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడే అనిపిస్తుంది. ఐతే సూర్య ఎందుకో లేటెస్ట్ గా తన ఒరిజినల్ లుక్ ని రివీల్ చేశాడు. అదేంటి ఇన్నాళ్లు మనం చూసింది ఒరిజినల్ కాదా అంటే.. ఒరిజినలే కానీ సూర్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ సర్ ప్రైజ్ చేసింది.

సూర్య లేటెస్ట్ లుక్..

చెన్నైలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు వెళ్లాడు సూర్య. అక్కడ సూర్య మీద కెమెరాలు క్లిక్ అనిపించాయి. ఐతే సూర్య సూటు బూటు అదిరిపోయాయి. కానీ షేవింగ్ విషయంలో తేడా గుర్తించారు. సూర్య ఎప్పుడు బయటకు వచ్చినా క్లీన్ షేవ్ తో కనిపిస్తారు. అంతేకాదు అసలు వైట్ హెయిర్ ని బయట పడనివ్వరు. కానీ సూర్య లేటెస్ట్ లుక్ లో గడ్డంలో అక్కడక్కడ తెల్ల జుట్టు కనిపించిది.

అది చూసిన సూర్య ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అదేంటి సూర్య ఇన్నాళ్లు తన ఒరిజినల్ లుక్ ని ఎందుకు దాచేశాడంటూ డిస్కషన్ మొదలు పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖ్యంగా తమిళ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. తమిళ హీరోల్లో అజిత్ ఆల్రెడీ తన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో సినిమాలు కూడా చేస్తున్నారు. దళపతి విజయ్ కూడా ఇలానే తన ఒరిజినల్ లుక్ తో కనిపిస్తారు. సూర్య మాత్రం ఇలా కనిపించడం చాలా అరుదు.

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో..

సూర్య రెట్రో సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న ప్రాజెక్ట్ గా ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది.